News April 11, 2025

ASF: విద్యార్థులకు GOOD NEWS.. FREE COACHING

image

పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్షకు హాజరుకానున్న విద్యార్థులకు రెబ్బెన మండలం గోలేటి టౌన్ షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో గురువారం నుంచి ఉచిత శిక్షణ తరగుతులు నిర్వహిస్తున్నారు. ఈవిషయాన్ని ఏరియా పర్సనల్ మేనేజర్ పాఠశాల కరస్పాండెంట్ రెడ్డిమల్ల తిరుపతి తెలిపారు. 10వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు

Similar News

News April 18, 2025

కాసేపట్లో వర్షం!

image

TG: పలు జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, సిరిసిల్ల, రంగారెడ్డి, MBNR, నారాయణపేట్, యాదాద్రి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వానలు పడతాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం నుంచి రాత్రి మధ్యలో వర్షాలు పడే అవకాశం ఉందని ట్వీట్ చేశారు.

News April 18, 2025

TTD ఈవో బంగ్లాలో నాగుపాము హల్‌చల్ 

image

తిరుపతిలోని టీటీడీ ఈవో శ్యామలరావు బంగ్లాలో రాత్రి నాగుపాము హల్‌చల్ చేసింది. పామును పట్టేందుకు రిటైర్డ్ టీటీడీ ఉద్యోగి రవీందర్ నాయుడును తీసుకు వచ్చారు. ఆయన పామును పట్టి గొనె సంచెలో వేస్తుండగా చేతిపై కాటేసింది. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే ఆయనను స్విమ్స్‌కు తరలించారు‌. ప్రస్తుతం రవీందర్ నాయుడు కోలుకుంటున్నారు.

News April 18, 2025

IPL: CSKలోకి బేబీ ABD?

image

సౌతాఫ్రికా క్రికెటర్ డెవాల్డ్ బ్రెవిస్ ఇన్‌స్టా‌లో యెల్లో కలర్ ఇమేజ్‌ను పోస్ట్ చేయడం ఆసక్తికరంగా మారింది. అతడు IPLలో CSK జట్టులో చేరనున్నారా? అనే సందేహాలు మొదలయ్యాయి. ఇప్పటికే పలువురు CSK అభిమానులు సోషల్ మీడియా వేదికగా బ్రెవిస్‌కు స్వాగతం చెబుతున్నారు. అయితే అతడు నిజంగానే CSKలో చేరుతారా? మరేదైనా విషయమా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. బేబీ ఏబీగా పాపులరైన బ్రెవిస్ గతంలో MIకి ఆడారు.

error: Content is protected !!