News February 27, 2026

ASF: సృజనకు బ్రెయిన్ డెడ్.. నలుగురికి కొత్త జీవితం

image

ఆసిఫాబాద్ జిల్లా జనకాపూర్‌లో బ్రెయిన్ డెడ్ అయిన ఈస్త సృజన(34) అవయవాలను దానం చేసి నలుగురికి జీవితం ప్రసాదించారు బాధిత కుటుంబీకులు. తల్లిదండ్రుల ఇంట్లో అకస్మాత్తుగా అస్వస్థతకు గురైన సృజన ICUలో చికిత్స పొందినా ప్రాణం దక్కలేదు. భర్త నాగరాజు అంగీకరించడంతో కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు సేకరించి అవసరంలో ఉన్నవారికి అమర్చారు. సృజన మృతితో గ్రామం కన్నీరుమున్నీరుగా విలపించింది. కుటుంబాన్ని అభినందించింది.

Similar News

News April 14, 2026

భీమవరం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి

image

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

News April 14, 2026

850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు!

image

లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించనుంది. ఆర్టికల్ 55, 81కు సవరణలు చేపట్టనుంది. ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చింది. 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిపైనా చర్చ జరగనుంది.

News April 14, 2026

బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి

image

బిహార్ కొత్త సీఎంగా బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు ఖరారైంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఆయనను అధికారికంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల అధినేతలు ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా సీఎం పదవికి కాసేపటి క్రితం నితీశ్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.