News March 29, 2025
ASF: అగ్నివీర్‌కు ఎంపికైన విద్యార్థి

ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాఫూలే కళాశాలలోని విద్యార్థి CH.సచిన్ ఇండియన్ ఆర్మీ అగ్నివీర్‌కు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపల్ బానోత్ శ్వేత తెలిపారు. ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతూనే ఆర్మీకి ఎంపికైనందుకు కళాశాల సిబ్బంది విద్యార్థి సచిన్‌ను అభినందించారు.
Similar News
News December 13, 2025
MBNR: నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం.. 1,508 మంది గైర్హాజర్

ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాలలో 6వ తరగతి ప్రవేశాలకు శనివారం నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలోని 29 కేంద్రాలలో పరీక్ష నిర్వహించగా మొత్తం 7,115 మంది దరఖాస్తు చేసుకోగా 5,607 మంది హాజరయ్యారు. 1,508 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు వట్టెం నవోదయ ప్రిన్సిపల్ భాస్కర్ కుమార్ తెలిపారు.
News December 13, 2025
వరంగల్: బాబోయ్.. అక్కడ పనిచేయడం కష్టమే!

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఓ అధికారి పేరు చెబితే సిబ్బంది వణికిపోతున్నారు. అక్కడ ఆ అధికారి దగ్గర పనిచేయడానికి సైతం జంకుతున్నారు. 18 నెలల్లో 20 మంది సెక్యూరిటీ సిబ్బంది, ఆరుగురు క్యాంప్ క్లర్క్‌లు, 10 మంది వంటవారిని మార్చడంతో ఆ అధికారి హాట్ టాపిక్ అయ్యారు. ఇంతకు ఎందుకు మార్చుతున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఏ సెటిల్మెంట్లు లేకపోయినా సిబ్బందిని మార్చడం ఉద్యోగుల సర్కిళ్లలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
News December 13, 2025
‘స్క్రబ్ టైఫస్’పై భయాందోళనలు వీడాలి- DMHO

‘స్క్రబ్ టైఫస్’పై ప్రజల్లో అపోహలు, భయాందోళనలు వద్దని DMHO డా. కె.వెంకటేశ్వర రావు స్పష్టం చేశారు. జిల్లాలో ఇప్పటివరకు 3 ‘స్క్రబ్ టైఫస్’ కేసులు మాత్రమే గుర్తించామనిని, అవి కూడా సాధారణ ఆరోగ్య పరీక్షలలో భాగంగా నిర్ధారణ అయినవేనని తెలిపారు. జిల్లాలో ఎక్కడా ‘స్క్రబ్ టైఫస్’ వ్యాప్తి పరిస్థితి లేదని ఆయన స్పష్టం చేశారు. ‘స్క్రబ్ టైఫస్’ అనేది ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వ్యాపించే వ్యాధి కాదన్నారు.


