News August 22, 2025
ASF: అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో పాల్గొన్న కలెక్టర్

ఆసిఫాబాద్ మండలం అంకుసాపూర్ గ్రామంలో పనుల జాతర- 2025లో భాగంగా కొత్తగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని కలెక్టర్ వెంకటేష్ దొత్రే, స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా గత 100 రోజులుగా సెలవు లేకుండా నిరంతరం పనిచేసిన మున్సిపల్ సిబ్బందిని కలెక్టర్, ఎమ్మెల్యే శాలువాలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు.
Similar News
News August 22, 2025
రూ.5,000కోట్లు కేటాయించండి: సీఎం చంద్రబాబు

AP: ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం(SASCI) కింద రాష్ట్రానికి మరో రూ.5వేల కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను CM CBN కోరారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.2,010CR అందాయని తెలిపారు. అలాగే సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల మేరకు రూ. 250CR విడుదలకు ఉత్తర్వులివ్వాలని కోరారు. కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకానికి త్వరగా విధివిధానాలు రూపొందించి అమల్లోకి తేవాలని సూచించారు.
News August 22, 2025
కూకట్‌పల్లిలో 12 ఏళ్ల బాలికను హత్య చేసిన బాలుడు!

కూకట్‌పల్లిలోని సంగీత్‌నగర్‌లో బాలిక సహస్ర హత్య కేసు కీలక మలుపు తిరిగింది. 5వ రోజు కేసును ఛేదించిన పోలీసులు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. సహస్ర ఇంటి పక్కనే ఉన్న భవనంలో నివసిస్తున్న 10వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్లు గుర్తించారు. దొంగతనానికి వెళ్లిన సమయంలో బాలికను చూసి హత్య చేసినట్లు అతడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News August 22, 2025
టేకులపల్లిలో రూ.2.12 కోట్ల గంజాయి పట్టివేత

ఇల్లందు DSP ఆదేశాల మేరకు టేకులపల్లిలోని వెంకిట్యాతండ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. లారీపై అనుమానం వచ్చి తనిఖీచేయగా రూ.2.12 కోట్ల విలువ గల 424 కిలోల గంజాయి లభ్యమైంది. లారీలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించారు. రాజస్థాన్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు నేరం ఒప్పుకున్నారని DSP తెలిపారు. వారి నుంచి 2 సెల్‌ఫోన్‌లు, గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్‌కు తరలించామని పేర్కొన్నారు.