News September 17, 2025
ASF: ఆపేరేషన్ పోలోలో తొలిసారి ఈ గ్రామంలోనే జెండా ఆవిష్కరణ

దహేగాం మండలం బీబ్ర గ్రామానికి ఘనమైన చరిత్ర ఉంది. ఆపరేషన్ పోలోలో తొలిసారి ఈ గ్రామంలో జాతీయ జెండా ఆవిష్కరించారు. 1947 AUG 15 అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చిన సమాచారం ఈ గ్రామ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. దీంతో స్వాతంత్ర్య సమరయోధుడు బండ్ల మల్లయ్య ఇంటి ఆవరణలో జెండా గద్దె నిర్మించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. నాటి నుంచి నేటి వరకు అక్కడే జెండా ఎగరేస్తున్నారు.
Similar News
News September 17, 2025
కామారెడ్డి జిల్లాలో వర్షపాతం UPDATE

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. ఇసాయిపేట 50 MM, సదాశివనగర్ 48.5, రామలక్ష్మణపల్లి 42.3, హాసన్ పల్లి 34.3, తాడ్వాయి 25.5, పాత రాజంపేట 24.3, మాచాపూర్ 24, లింగంపేట 21.3, IDOC(కామారెడ్డి) 15, భిక్కనూర్ 14.3, నాగిరెడ్డి పేట 8.3, పిట్లం 7, వెల్పుగొండ 5, రామారెడ్డి 4.3, బీబీపేట 4, గాంధారి, లచ్చపేటలో 3.5 MM వర్షపాతం రికార్డయ్యింది.
News September 17, 2025
బైరాన్‌పల్లి రక్షక దళాల పోరాటం మరువలేనిది..!

వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన బైరాన్‌పల్లి గ్రామం రక్షక దళాల పోరాటం మరువలేనిది. ఇమ్మడి రాజిరెడ్డి, జగ్గం హనుమంతు, చల్లా నర్సిరెడ్డి, పోశాలు తోటరాములు, రాంరెడ్డిల ఆధ్వర్యంలో రజాకార్లకు వ్యతిరేకంగా రక్షక దళం ఏర్పాటు చేసి బురుజుపై గస్తీదళ సభ్యులను నియమించారు. స్వాతంత్ర్యం వచ్చిన 12 రోజులకే ఆగస్టు 27న అర్ధరాత్రి బైరాన్‌పల్లి గ్రామంపై రజాకార్లు విరుచుకుపడి 84 మందిని నిలబెట్టి కాల్చి చంపారు.
News September 17, 2025
రాయలసీమ రుచుల రారాజు ‘చెనిక్కాయ’

రాయలసీమకు చెనిక్కాయలకు విడదీయని సంబంధం ఉంది. వాటితో చేసే చెనిక్కాయల పొడి, ఉరిమిండి, ఉడికేసిన చెనిక్కాయలు, పాగం పప్పు వంటి వంటకాలు మన సీమ ప్రత్యేకం. చెనక్కాయకు వేల ఏళ్ల చరిత్ర ఉంది. క్రీస్తుపూర్వం 7వేల ఏళ్ల క్రితమే దక్షిణ అమెరికాలో మొదలైన సాగు తర్వాత భారత ఉపఖండానికి వ్యాపించింది. చెనక్కాయల సాగులో దేశంలో ఏపీ టాప్‌లో ఉండగా అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాల్లో రాష్ట్రంలోనే అధికంగా సాగుచేస్తారు.