News March 15, 2025
ASF: ఇఫ్తార్ విందులో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ

ఆసిఫాబాద్ జిలాల్లో శుక్రవారం రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్సీ దండే విట్టల్ అధ్యర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసులు, అదనపు కలెక్టర్ దిపక్ తివారి, తదితరులు హాజరయ్యారు. అనంతరం విందును స్వీకరించి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మొహమ్మద్ సద్దాం, మొయిన్, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News January 2, 2026
జైనథ్: కిసాన్ యాప్‌ను వెంటనే తొలగించాలి: మాజీ మంత్రి

రైతులకు అన్యాయం చేసే కిసాన్ యాప్‌ను వెంటనే తొలగించాలని మాజీ మంత్రి జోగు రామన్న డిమాండ్ చేశారు. రైతు కొనుగోలు సమస్యలు పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జైనథ్ మండలం కాప్రి వద్ద జాతీయ రహదారిపై రైతులతో కలిసి బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. దీంతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయ్యింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తుందని మండిపడ్డారు.
News January 2, 2026
ఈనెల 5 నుంచి అన్నారం షరీఫ్‌లో ఉర్సు!

వరంగల్(D) పర్వతగిరి మండలంలోని అన్నారం షరీఫ్ యాకూబ్ షావలి బాబా దర్గా ఉర్సు ఈనెల 5 నుంచి ప్రారంభం కానుంది. దీంతో తొర్రూరు, NSPT, MHBD, HNK, WGL, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, గోదావరిఖని, మంచిర్యాల, నల్గొండ డిపోల నుంచి బస్సులను నడిపించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఆయా డిపోల అధికారులకు కరపత్రాలను అందించారు. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారు. మీరు వెళ్తున్నారా?
News January 2, 2026
VJA: శిశువుల అపహరణ కేసుల విచారణ వేగవంతం

విజయవాడలో సంచలనం సృష్టించిన శిశువుల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రధాన నిందితులు సరోజిని,భారతిలను కస్టడీలోకి తీసుకుని భవానీపురం పోలీసులు విచారిస్తున్నారు. వైద్య పరీక్షల అనంతరం వారిని రహస్య ప్రాంతంలో ప్రశ్నిస్తున్నారు. శిశువులను ఎక్కడి నుంచి అపహరించారు? ఎవరెవరికి విక్రయించారు? అన్న కోణంలో కీలక సమాచారం సేకరిస్తున్నారు. ఈ ముఠా వెనుక ఉన్న ఇతర సూత్రధారుల కోసం గాలింపు ముమ్మరం చేశారు.


