News August 23, 2025
ASF: ఈనెల 25 వరకు ప్రీ ప్రైమరీ పోస్టులకు దరఖాస్తులు

ఆసిఫాబాద్ జిల్లాలోని 41 పాఠశాలల్లో తాత్కాలిక పద్ధతిలో పనిచేయడానికి ప్రీ ప్రైమరీ ఇన్‌స్ట్రక్టర్, ఆయా పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు డీఈఓ దీపక్ తివారి తెలిపారు. ఇన్‌స్ట్రక్టర్ పోస్టుకు ఇంటర్మీడియట్, ఆయా పోస్టుకు 7వ తరగతి ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి గలవారు ఈనెల 25లోపు దరఖాస్తులు సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.
Similar News
News August 24, 2025
కామారెడ్డి: కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలి

పెండింగులో ఉన్న కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలని జిల్లా న్యాయ సేవా అథారిటీ ఛైర్మన్ వరప్రసాద్ సూచించారు. శనివారం జిల్లా న్యాయ సేవ అథారిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అందులో సాధ్యమైన అన్ని కేసులు పరిష్కారం అయ్యే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విక్టర్, ఎస్పీ రాజేశ్ చంద్ర పాల్గొన్నారు.
News August 24, 2025
100 దేశాలకు భారత్ నుంచి EVల ఎగుమతి: మోదీ

100 దేశాలకు EVలు ఎగుమతి చేసిన అరుదైన మైలురాయిని భారత్ అందుకోనుందని వరల్డ్ లీడర్ ఫోరమ్‌లో PM మోదీ అన్నారు. 2014 వరకు ఏటా ఆటోమొబైల్ ఎగుమతుల విలువ రూ.50వేల కోట్లు ఉంటే ప్రస్తుతం రూ.1.2 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. భారత్ ఇప్పుడు మెట్రో కోచ్‌లు, రైల్ కోచ్‌లు, లోకోమోటివ్స్ ఎగుమతిని ప్రారంభించిందని పేర్కొన్నారు. 100దేశాలకు ఎగుమతుల మైలురాయికి గుర్తుగా ఎల్లుండి ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
News August 24, 2025
మోడల్ స్కూల్లో కమిటీల ప్రమాణస్వీకారం

చిన్నశంకరంపేట మోడల్ స్కూల్‌లో స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్, హౌసెస్ క్యాప్టెన్, వైస్ కెప్టెన్, కల్చరల్, డిసిప్లేన్ కమిటీల ఇన్‌ఛార్జుల ప్రమాణ స్వీకారం నిర్వహించినట్లు ప్రిన్సిపల్ వాణి కుమారీ తెలిపారు. కార్యక్రమానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ శశిధర్, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దీప్లా రాథోడ్, కమిటీ ఫీర్మన్ స్రవంతి హాజరయ్యారు. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ప్రదర్శన ఆకట్టుకుంది.