News March 13, 2025

ASF: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

డిగ్రీ పాసైన BC అభ్యర్థులకు బ్యాంకింగ్&ఫైనాన్స్‌లో ఫ్రీ ట్రైనింగ్,ఉద్యోగం కల్పించడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ట్రైనింగ్ పూర్తైన తర్వాత ప్రైవేట్ బ్యాంకుల్లో ప్లేస్‌మెంట్ కల్పిస్తారన్నారు. అర్హులు ఈనెల 15 నుంచి www.tgbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఏజ్ లిమిట్-26లోపు ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్-ఏప్రిల్ 8గా పేర్కొన్నారు. SHARE IT

Similar News

News February 23, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.2,070 పెరిగి రూ.1,61,350కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,900 ఎగసి రూ.1,47,900 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ ధర రూ.10,000 పెరిగి రూ.3 లక్షలకు చేరింది.

News February 23, 2026

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 500పాయింట్లు లాభపడి 83,308 వద్ద, నిఫ్టీ 150పాయింట్లు వృద్ధి చెంది 25,717 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. భారత్‌పై US టారిఫ్స్ తగ్గడం, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కాస్త సద్దుమణగడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు. బ్యాంకింగ్, రిలయన్స్, పవర్‌గ్రిడ్, ఎటర్నల్, ఎయిర్‌టెల్ షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.

News February 23, 2026

భువనగిరి: గ్రామపంచాయతీలకు నిధులు విడుదల

image

జిల్లాలోని 427 గ్రామ పంచాయతీల ఖాతాల్లోకి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.7.59 కోట్లు జమ అయ్యాయి. జనాభా ప్రాతిపదికన ఒక్కో పంచాయతీకి రూ.48 వేల నుంచి రూ.9.8 లక్షల వరకు అందాయి. ఈ నిధుల్లో 60 శాతాన్ని తాగునీరు, పారిశుద్ధ్య పనులు, మిగిలిన 40 శాతాన్ని పెండింగ్ బిల్లులు, ఇతర అభివృద్ధి పనులకు మార్చి 31లోగా ఖర్చు చేయాల్సి ఉంటుంది.