News February 11, 2025

ASF: ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా కృషి చేయాలి: RJD

image

పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాలే లక్ష్యంగా ఉపాధ్యాయ సిబ్బంది కృషి చేయాలని రీజినల్ జాయింట్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి అన్నారు. సోమవారం ఆసిఫాబాద్‌లోని రాజేంద్ర ప్రసాద్ బీఎడ్ కళాశాలలో డీఈవో యాదగిరితో కలిసి జిల్లాలో హెచ్ఎంలకు పదో తరగతి వార్షిక పరీక్షలపై సమీక్ష నిర్వహించారు. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి, అపోహలు లేకుండా ఏకాగ్రతతో ఉండేలా అవగాహన కల్పించాలన్నారు.

Similar News

News November 4, 2025

పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకం: VZM SP

image

జిల్లాలో నేరాలను అరికట్టడంలో పాత నేరస్థుల కదలికలపై నిఘానే కీలకమని ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగిన నేర సమీక్షలో ఆయన మాట్లాడారు. హిస్టరీ షీటర్లు, పాత నేరస్థులపై ప్రత్యేక బృందాలు కట్టుదిట్టంగా నిఘా పెట్టాలని సూచించారు. రాత్రి గస్తీని ముమ్మరం చేసి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. గంజాయి రవాణా, జూదాలు, కోడి పందాలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

News November 4, 2025

బోయిన్‌పల్లిలో దారుణం.. చిన్నారిపై డాన్స్ మాస్టర్ వేధింపులు

image

ఓల్డ్‌ బోయిన్‌పల్లిలోని సుబ్బు డాన్స్‌ స్టూడియో నిర్వాహకుడు జ్ఞానేశ్వర్‌ నాలుగేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు. 2 నెలలుగా డాన్స్ స్కూల్‌కు వెళ్తున్న చిన్నారి ఈమధ్య ఆకస్మికంగా మానేసింది. చిన్నారి చెప్పిన వివరాల మేరకు తల్లిదండ్రుల ఫిర్యాదుతో బోయిన్‌పల్లి పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. స్టూడియోను మూసివేసినట్లు ఉత్తర మండల డీసీపీ రష్మీ పెరుమాళ్‌ తెలిపారు.

News November 4, 2025

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలి: శ్రీకాకుళం కలెక్టర్

image

ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మంగళవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు. 6.50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడానికి 5500 వాహనాలకు జీపీఎస్ వినియోగం సాధ్యం కానందున 9 బృందాలను ఏర్పాటు చేసి ట్రాకింగ్ డివైజ్‌లు ఇన్‌స్టాల్ చేయాలన్నారు. 200 ఈ-హబ్ ఛార్జింగ్ స్టేషన్లకు స్థలం పరిశీలించాలన్నారు.