News March 9, 2026
ASF: ఓటింగ్ యంత్రాల భద్రతకు పటిష్ట చర్యలు: కలెక్టర్

ASF జిల్లా కేంద్రంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు భద్రపరచిన గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్‌తో కలసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ఈవీఎం గోదాంను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదాం వద్ద 24 గంటల పాటు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి, సీసీ కెమెరాల పర్యవేక్షణ నిర్వహిస్తున్నామన్నారు.
Similar News
News April 14, 2026
భీమవరం కలెక్టరేట్‌లో అంబేడ్కర్ జయంతి

భీమవరం కలెక్టరేట్‌లో మంగళవారం అంబేడ్కర్ 135వ జయంతి వేడుకలు జరిగాయి. కలెక్టర్ చదలవాడ నాగరాణి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. అంబేడ్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని అసమానతల తొలగింపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాజిక సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
News April 14, 2026
850కి పెరగనున్న లోక్‌సభ స్థానాలు!

లోక్‌సభ సీట్లను 850కి పెంచాలని కేంద్రం ప్రతిపాదించింది. ఇందులో రాష్ట్రాలకు 815 స్థానాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 35 సీట్లు కేటాయించనుంది. ఆర్టికల్ 55, 81కు సవరణలు చేపట్టనుంది. ఈ మేరకు ఎంపీలకు సమాచారం ఇచ్చింది. 16, 17, 18 తేదీల్లో జరిగే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లుతో పాటు దీనిపైనా చర్చ జరగనుంది.
News April 14, 2026
బిహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి

బిహార్ కొత్త సీఎంగా బీజేపీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరి పేరు ఖరారైంది. బీజేపీ శాసనసభాపక్ష నేతగా ఎమ్మెల్యేలు ఆయనను అధికారికంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల అధినేతలు ఆయనకు కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్లు చేస్తున్నారు. రేపు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా సీఎం పదవికి కాసేపటి క్రితం నితీశ్ కుమార్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.


