News November 25, 2025
ASF కార్మికుల బీమా పెంపు

భవన నిర్మాణ, ఇతర కార్మికుల సంక్షేమంపై చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో కార్మిక భీమా పెంపు, కార్మికుల సంక్షేమంపై కార్మిక శాఖ అధికారులు, భవన నిర్మాణ కార్మిక సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం సహజ మరణానికి అందించే సాయాన్ని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.6 నుంచి రూ.10 లక్షలకు పెంచినట్లు వెల్లడించారు.
Similar News
News November 25, 2025
దివ్యాంగులకు స్వయం సహాయక సంఘాలు.. వచ్చే నెల 3న ఏర్పాటు

TG: రాష్ట్రంలో దివ్యాంగుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబరు 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీటిని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుంది. గత నెలలో గ్రామాల్లో మహిళా సమాఖ్యల ద్వారా లక్షన్నర మంది దివ్యాంగ మహిళలు, పురుషులను సెర్ప్ గుర్తించింది. మహిళల అధ్యక్షతన ఒక్కో స్వయం సహాయక సంఘంలో 5 నుంచి 10 మంది వరకు సభ్యులు ఉండాలని నిర్దేశించింది.
News November 25, 2025
పీరియడ్స్ రావట్లేదా..? అయితే జాగ్రత్త

కొంతమందికి ప్రతినెలా పీరియడ్స్ రావు. దానికి వ్యాధులు, తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం, బరువు హఠాత్తుగా పెరగడం లేదా తగ్గడం వంటివి కారణం కావచ్చంటున్నారు నిపుణులు. ఏ కారణంతో పీరియడ్స్ రావడం లేదో వైద్యులను సంప్రదించి తెలుసుకోవడం చాలా అవసరం. పీరియడ్స్ మీ ఆరోగ్య స్థితికి అద్దంపడతాయి. కాబట్టి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే ఏదో అంతర్లీన సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. వెంటనే తగిన వైద్యం తీసుకోవడం చాలా ముఖ్యం.
News November 25, 2025
21 మండలాలతో మదనపల్లె జిల్లా..!

మదనపల్లె జిల్లాకు CM గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా.. 21మండలాలతో జిల్లా ఏర్పాటు కానుంది. మదనపల్లెతో పాటు కొత్తగా పీలేరును రెవెన్యూ డివిజన్(12మండలాలు) చేస్తారు. సదుం, సోమల, పుంగనూరు, చౌడేపల్లె, రొంపిచెర్ల, పులిచెర్ల, పీలేరు, వాయల్పాడు, గుర్రంకొండ, కలికిరి, కలకడ, KVపల్లె ఇందులో ఉంటాయి. మదనపల్లె జిల్లాలో 9మండలాలు ఉంటాయి. రాయచోటి, రైల్వేకోడూరు, రాజంపేటకు అన్నమయ్య జిల్లా పరిమితం కానుంది.


