News April 15, 2025
ASF: కులాంతరం వివాహం.. ప్రభుత్వ సాయం

కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో కులాంతర వివాహం చేసుకున్న 8 జంటలకు రూ. 20 లక్షల ఆర్థికసాయం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలసి అందజేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జంటకి రూ.2.5 లక్షలు ప్రభుత్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు.
Similar News
News February 22, 2026
ఉద్యమానికి ఇక సెలవు!

వరుస ఎన్‌కౌంటర్లు, కీలక నేతల లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ ఉద్యమ ప్రస్థానం ముగింపు దశకు చేరింది. ఎర్రసైన్యం సుదీర్ఘ పోరాటానికి 2021లో ఆర్కే మరణంతో బీటలు వారాయి. తర్వాత హిడ్మా, నంబాల కేశవరావు లాంటి కీలక నేతలు హతమయ్యారు. మల్లోజుల, ఆశన్న, దేవ్‌జీ, రాజిరెడ్డి లొంగిపోయారు. గణపతి విదేశాలకు వెళ్లిపోగా, బడే చొక్కారావు కోసం వేట కొనసాగుతోంది. ప్రస్తుతం అడవుల్లో అతికొద్ది మంది మాత్రమే ఉన్నట్లు సమాచారం.
News February 22, 2026
BREAKING.. చింతూరు: హైవేపై యాక్సిడెంట్.. ఒకరి మృతి

చింతూరు మండలం సింగనగూడెం గ్రామం టర్నింగ్ వద్ద తమిళనాడు నుంచి జైపూర్‌కు వెళ్తున్న కారు ఇవాళ ఉదయం 10 గంటల సమయంలో ప్రమాదానికి గురైంది. కారులో ఐదుగురు ప్రయాణిస్తుండగా.. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారికి గాయాలయ్యాయి. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం కారణంగా వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News February 22, 2026
కామారెడ్డిలో వార్.. ముగింపు కార్డు పడనుందా?

సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డి రణరంగంగా మారింది. అభివృద్ధి విషయంలో పోరాడాల్సిన వారే ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి ఇరు పార్టీల అధినేతలు వెళ్లి సంబంధిత అంశాలపై చర్చించి నిజానిజాలు తేల్చుకుంటారా! ఈ అంశాలపై ముగింపు కార్డు వేస్తారా! అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా మున్సిపల్ ఎన్నికల్లో హామీలిచ్చిన నేతలు అభివృద్ధిలో మమేకం కావాలంటున్నారు.


