News April 15, 2025
ASF: కులాంతరం వివాహం.. ప్రభుత్వ సాయం

కులాంతర వివాహాలు చేసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మీ అన్నారు. సోమవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో కులాంతర వివాహం చేసుకున్న 8 జంటలకు రూ. 20 లక్షల ఆర్థికసాయం అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలసి అందజేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో జంటకి రూ.2.5 లక్షలు ప్రభుత్వం చేయూతనిస్తుందని పేర్కొన్నారు.
Similar News
News April 16, 2025
గర్ల్‌ఫ్రెండ్ ఉందన్నందుకు యూఎస్ వీసా రిజెక్ట్

ఢిల్లీకి చెందిన ఓ యువకుడి నిజాయితీ అతడికి US వీసా రాకుండా చేసింది. ఇంటర్వ్యూ కోసం అతడు ఎంబసీకి వెళ్లగా ‘మీకు USలో ఫ్యామిలీ/ఫ్రెండ్స్ ఉన్నారా’ అని ఆఫీసర్ ప్రశ్నించారు. ‘అవును, ఫ్లోరిడాలో నా గర్ల్‌ఫ్రెండ్ ఉంది. తనను కలవాలని ప్లాన్ చేసుకున్నా’ అని అతడు సమాధానమిచ్చాడు. అంతే మరో ప్రశ్న లేకుండా వీసా రిజెక్షన్ స్లిప్ చేతిలో పెట్టారు. ఈ విషయాన్ని బాధితుడు రెడ్డిట్‌లో పోస్ట్ చేయగా చర్చనీయాంశమైంది.
News April 16, 2025
ప.గో: భీమవరం సబ్ డివిజన్‌కు ఏబీసీడీ అవార్డు

రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం రేపిన ఉండి మండలం యండగండిలో శవం పార్సెల్ కేసు విషయం తెలిసిందే. ఈకేసును చేధించిన భీమవరం సబ్ డివిజన్ పోలీసులకు ఏబీసీడీ ప్రథమ అవార్డు లభించింది. బుధవారం ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మిలు అవార్డును అందజేశారు. సబ్ డివిజన్ పోలీస్ సిబ్బందికి డీజీపీ అభినందనలు తెలిపారు.
News April 16, 2025
బెడ్ మీద ఇలా చేయకండి!

మనలో చాలామంది తడి టవల్స్ బెడ్ మీదే వేస్తుంటాం. వాటి గురించి పెద్దగా పట్టించుకోం. కానీ వాటిలోని తడి కారణంగా పరుపు, దుప్పట్లలో క్రిములు పెరిగే ప్రమాదం ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తడివే కాక విడిచిన దుస్తులు సైతం మన శరీరం నుంచి సూక్ష్మక్రిముల్ని బెడ్‌పైకి మోసుకెళ్తాయంటున్నారు. బయట తిరిగొచ్చి కాళ్లు కడగకుండా మంచంపైకి చేరడమూ అనారోగ్యాలకు కారణమవుతాయని వివరిస్తున్నారు.