News February 16, 2025
ASF: కేంద్రం నుంచి రూ.3 కోట్లు మంజూరు

ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా చేపట్టవలసిన పనుల అంచనాలతో వెంటనే నివేదిక రూపొందించి సమర్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. శనివారం ASF కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ కార్యక్రమంలో భాగంగా చేపట్టవలసిన అభివృద్ధి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి మంజూరైన 3 కోట్ల నిధులతో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలన్నారు.
Similar News
News September 16, 2025
ఏలూరు: కాలువలో దొరికిన మృతదేహం వివరాలు లభ్యం

ఏలూరు కొత్తూరు జూట్ మిల్లు వద్ద కాలువలో లభ్యమైన మృతదేహాన్ని గ్రీన్ సిటీకి చెందిన కోట ప్రసాద్ (48)గా పోలీసులు గుర్తించారు. అతిగా మద్యం సేవించడంతో పడమర లాకుల్లో పడి కొట్టుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News September 16, 2025
MBNR: SP సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

MBNRలోని పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో ఈ రోజు నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్పీ డి.జానకి అధికారులకు కీలక సూచనలు చేశారు.
✒CC కెమెరాల నిఘా పెంచి, పని చేయని కెమెరాలను వెంటనే రిపేర్ చేయాలి.
✒పెండింగ్‌లో ఉన్న అరెస్టులు, FSL రిపోర్టులు పూర్తి చేయాలి.
✒ప్రజావాణి.. వెంటనే చర్యలు తీసుకోవాలి.
✒POCSO కేసుల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలి.
✒వ్యవస్థీకృత నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
News September 16, 2025
KNR: శాతవాహన డిగ్రీ ఇన్స్టంట్ ఎగ్జామ్ రేపే

డిగ్రీ ఆఖరు సంవత్సరంలో ఒక సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థుల కోసం ఇన్స్టంట్ పరీక్ష SEP 17న (రేపు) ఉదయం, మధ్యాహ్నం జరుగుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డి. సురేష్ కుమార్ తెలిపారు. 5వ సెమిస్టర్ ఎగ్జామ్ ఉ.9 గం.ల నుంచి మ.12 గం.ల వరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, వివేకానంద డిగ్రీ కళాశాలలో జరుగుతాయని, 6వ సెమిస్టర్ ఎగ్జామ్ మ.2 గం.ల నుంచి సా.5 గం.ల వరకు శ్రీ చైతన్య డిగ్రీ కళాశాలలో జరుగుతాయని చెప్పారు.