News September 21, 2025
ASF: ‘కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ తల్లి గర్వం’

దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమం వరకు క్రియాశీలక పాత్ర పోషించిన కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి నేడు.1952లో ASF నుంచి శాసనసభలో అడుగుపెట్టారు. 1957లో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని తృణప్రాయంగా వదిలేసిన మహనీయుడు. తెలంగాణ జెండాను ఎవరూ ఎత్తినా ముందుండి నడిపించిన పోరాట యోధుడు మన కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన జన్మస్థలం ASF జిల్లా వాంకిడి మండలం.
Similar News
News September 21, 2025
జన్‌జీ ఉద్యమం వస్తుందన్న KTR.. బండి సంజయ్ రిప్లై ఇదే!

TG: నేపాల్ తరహాలో INDలోనూ జన్‌జీ ఉద్యమం రావొచ్చన్న <<17778245>>KTR కామెంట్స్‌పై<<>> కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. ‘నేపాల్ జన్‌జీ నెపోటిజంపై పోరాడారు. తెలంగాణ జన్‌జీ వారి కంటే ముందే KCR, ఆయన పిల్లల్ని పక్కన పెట్టారు. లోక్‌సభ ఎన్నికల్లో BRSకు బిగ్ జీరో ఇచ్చారు. ఫ్యామిలీ రూల్‌ను అంతం చేశారు’ అని ట్వీట్ చేశారు. KTRను నెపో కిడ్‌గా పేర్కొంటూ NDTV-YUVA కాన్‌క్లేవ్‌లో ఆయనకు యువత రియాలిటీని చూపించిందన్నారు.
News September 21, 2025
చంద్రబాబు వల్లే పోలవరం ఆలస్యం: బుగ్గన

AP: పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడానికి చంద్రబాబే కారణమని వైసీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ ఎలా కట్టారని ప్రశ్నించారు. పోలవరానికి శంకుస్థాపన చేసి, అన్ని అనుమతులు తెచ్చింది వైఎస్సారేనని అన్నారు. హంద్రీ-నీవాపైనా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, అందులో ఎక్కువ పనులు చేసింది రాజశేఖర్ రెడ్డేనని చెప్పారు.
News September 21, 2025
ADB: మసకబారుతున్న జ్ఞాపకాలు.. నేడు అల్జీమర్స్ డే

ఒరేయ్, ఏరా అని పిలిచే తాత, నానమ్మ మనల్ని గుర్తుపట్టకపోతే ఎలా ఉంటుంది. ఇలాంటి జ్ఞాపకశక్తిని కోల్పోయేలా చేసే వ్యాధే అల్జీమర్స్. వృద్ధాప్యంలో కనిపించే ఈవ్యాధితో మొదటగా చిన్న విషయాలు మర్చిపోవడం, మాటల్లో తడబడటం కనిపిస్తుంది. తర్వాత దశలో రోగి తన కుటుంబీకులను గుర్తుపట్టలేని స్థితికి చేరవచ్చు. ఆరోగ్య సమస్యలతో ఈ వ్యాధి వస్తుంది. వృద్ధులే మన అ’పూర్వ’ సంపద వారిని కాపాడుకుందాం. ADBలో 50000+ వృద్ధులున్నారు.