News December 31, 2025
ASF: ‘కొత్త వ్యక్తుల వెరిఫికేషన్ తప్పనిసరి’

ఇళ్లలో వంట మనుషులు, వాచ్‌మెన్‌లు, కార్మికులుగా అపరిచితులను నియమించుకునేటప్పుడు పోలీస్ వెరిఫికేషన్ తప్పనిసరి అని ఆసిఫాబాద్ ఎస్పీ నితికా పంత్ సూచించారు. కొత్త వ్యక్తుల గత చరిత్ర, ప్రవర్తన, నేర నేపథ్యం తెలుసుకోవడం వల్ల భద్రత ఉంటుందని పేర్కొన్నారు. ఇంటిని అద్దెకు ఇచ్చే ముందు కూడా అద్దెదారుల వివరాలను పోలీసులకు తెలపాలన్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ ప్రజల రక్షణ కోసమేనని, అందరూ సహకరించాలని కోరారు.
Similar News
News February 18, 2026
వినియోగదారులకు అండగా NCH.. ఫిర్యాదు చేస్తే చాలు!

మీరు కొన్న వస్తువు నచ్చకపోయినా లేదా డబ్బులు తిరిగి రాకపోయినా ఇక ఆందోళన వద్దు. నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్-1915 (NCH) గత 9 నెలల్లో 79,521 ఫిర్యాదులను పరిష్కరించి, వినియోగదారులకు ఏకంగా ₹52 కోట్లు రిఫండ్ ఇప్పించింది. ముఖ్యంగా ఆన్‌లైన్ షాపింగ్ (ఈ-కామర్స్) మోసాలపై వచ్చిన 47,743 ఫిర్యాదులను పరిష్కరించింది. కోర్టుల చుట్టూ తిరిగే పనిలేకుండా డిజిటల్ పద్ధతిలోనే ఇలాంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
News February 18, 2026
HYD: AI ఆటాపాటే కాదు.. అంధులకు కంటిపాప

HYD బయో ఏషియా 2026 సదస్సులో క్వాడ్రిక్ IT సంస్థ కొత్త ఆవిష్కరణలతో అదరగొట్టింది. సాఫ్ట్‌వేర్ ముచ్చట్లే కాకుండా, అంధుల కోసం స్మార్ట్ AI కేన్ తెచ్చి వారి జీవితాల్లో వెలుగులు నింపింది. తక్కువ ధరకే లభించే ఈ స్టిక్, అడ్డంకులను పసిగట్టి వైబ్రేషన్‌తో హెచ్చరిస్తుంది. దీంతో పాటు మెడికల్ LLM, క్లోఫాస్ట్ వంటి టెక్నాలజీలతో ఫార్మా, బిజినెస్ రంగాల్లోని చిక్కుముడులను విప్పుతూ క్వాడ్రిక్ AI పవర్‌ను చాటిచెప్పింది.