News August 25, 2025
ASF: గణేశ్ ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించాలి: ఎస్పీ

కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గణేశ్ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ శాంతి లాల్ పాటిల్ సూచించారు. సోమవారం ఆసిఫాబాద్ ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గణేశ్ మండపాల వద్ద తగిన బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. నిమజ్జనం సందర్భంగా ఎక్కడికక్కడ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
Similar News
News August 25, 2025
లారీ కింద నలిగిపోయిన తండ్రీ కూతుళ్లు!

TG: ఊహించని ప్రమాదంలో ఒకేసారి తండ్రీ కూతుళ్లు ప్రాణాలు కోల్పోయిన ఘటన రంగారెడ్డి(D) చేవెళ్లలో చోటుచేసుకుంది. గురుకుల స్కూలులో చదువుతున్న కూతురు కృప(12)ను తండ్రి రవీందర్(32) బైకుపై ఇంటికి తీసుకువస్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొని వారి పైనుంచి వెళ్లింది. టైర్ల కింద నలిగిన వారిద్దరూ అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తండ్రీ కూతుళ్ల మరణం స్థానికులను కంటతడి పెట్టించింది.
News August 25, 2025
తెనాలి: వందేళ్లు దాటినా కష్టాలే.. పింఛన్ కోసం వృద్ధుడి ఆవేదన

తెనాలిలోని మల్లెపాడుకు చెందిన శతాధిక వృద్ధుడు భూషయ్య దీనావస్థలో కాలం వెళ్లదీస్తున్నాడు. వ్యవసాయం చేస్తూ ముగ్గురు పిల్లలను పెంచి ప్రయోజకులను చేసిన ఈయన, ప్రస్తుతం వారి ఆదరణకు నోచుకోక జీవచ్ఛవంలా బతుకుతున్నారు. ఆలపాటి ధర్మారావు హయాంలో యడ్లపల్లి పంచాయతీ మెంబరుగా పనిచేశారు. భూషయ్యకు వేలిముద్రలు పడకపోవడం వల్ల పింఛను కూడా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
News August 25, 2025
NGKL: ప్రజావాణి దరఖాస్తులపై సత్వర చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులపై ఆయా శాఖల అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బధావత్ సంతోష్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి 39 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు తీరుతాయని ప్రజలు ఎంతో ఆశతో వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారని గుర్తు చేశారు.