News March 31, 2025
ASF: గురుకులాల దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణ జ్యోతిబా ఫులే బీసీ గురుకులాలకు (6,7,8,9) తరగతుల బ్యాక్ లాగ్ సీట్ల కోసం దరఖాస్తు గడువు మార్చి 31తో ముగిసింది. కాగా అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఏప్రిల్ 6 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని పొడిగించినట్లు గురుకులాల జిల్లా సమన్వయకర్త శ్వేత వెల్లడించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News April 2, 2025
అన్నమయ్య యువతికి ఆల్ ఇండియా ర్యాంక్

CA ఫైనల్ ఫలితాల్లో అన్నమయ్య జిల్లా యువతి సత్తా చాటింది. తంబళ్లపల్లె(M) కన్నెమడుగుకు చెందిన తేజశ్విని ఆల్ ఇండియా 14వ ర్యాంకు సాధించింది. దీంతో ఆమెను MLA పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి అభినందించారు. YCP నాయకులతో కలసి తేజశ్వినిని శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయికి ఎదిగి తంబళ్లపల్లె పేరును అంతర్జాతీయ స్థాయిలో ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు.
News April 2, 2025
రిటైర్మెంట్ ప్రకటించిన హాకీ ప్లేయర్

భారత మహిళల హాకీ జట్టు తరఫున అత్యధిక మ్యాచులు ఆడిన వందన కటారియా అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. హాకీ ఇండియా లీగ్‌లో మాత్రమే ఆడతానని తెలిపారు. మొత్తం 320 మ్యాచులు ఆడిన వందన 158 గోల్స్ చేశారు. ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ గోల్ చేసిన భారత తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు సృష్టించారు. క్రీడా సేవలకు గుర్తుగా ఆమెను పద్మశ్రీ, అర్జున అవార్డులు వరించాయి.
News April 2, 2025
చలాన్లు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు?

చలాన్ల రికవరీని వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక చలాన్‌ను 3 నెలలలోపు చెల్లించకపోతే సదరు వాహనదారుడి డ్రైవింగ్ లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. మూడు చలాన్లు పడినవారి లైసెన్స్‌ను కనీసం 3 నెలలపాటు సస్పెండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే ఇన్సూరెన్స్ ప్రీమియంలో ఎక్కువ మొత్తం వసూలు చేస్తారని సమాచారం.