News April 16, 2025
ASF: గ్రేట్.. 40 నిమిషాల్లోనే దొంగను పట్టుకున్నారు

ఆసిఫాబాద్‌కు చెందిన మీర్అలీ స్కూటీలో పెట్టిన రూ.36 వేలు నగదును దొంగలు ఎత్తుకెళ్లడంతో ASF పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే ASF CI రవీందర్ పోలీస్ సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి 40 నిమిషాల వ్యవధిలోనే దొంగను పట్టుకున్నారు. అరెస్టు చేసి అతడి నుంచి రూ.36 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆసిఫాబాద్ పోలీస్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు.
Similar News
News November 6, 2025
కడప జిల్లాకు రానున్న శ్రీ చరణి

ఇండియన్ ఉమెన్స్ క్రికెటర్ నల్లపురెడ్డి శ్రీ చరణి రేపు కడప జిల్లాకు రానున్నట్లు కడప క్రికెట్ అసోసియేషన్ తెలిపింది. రేపు కడపలోని హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఏడు రోడ్ల మీదుగా రాజారెడ్డి క్రికెట్ స్టేడియం వరకు భారీ ర్యాలీ ఉంటుందని చెప్పింది. అనంతరం స్టేడియంలో ఆమెకు సత్కారం చేయనున్నట్లు పేర్కొంది. ఆమెకు రాజంపేట రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథరెడ్డి రూ.10 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు.
News November 6, 2025
MHBD: బీఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ ఆత్మహత్య

బయ్యారం మండలం కోటగడ్డకు చెందిన బీఎస్ఎఫ్ ఆర్మీ జవాన్ రాంబాబు సూసైడ్ చేసుకున్నాడు. మృతుడి భార్య మమత తెలిపిన వివరాలిలా.. 15ఏళ్లుగా ఆర్మీలో పనిచేస్తున్న రాంబాబు ఈ మధ్య కాలంలో విధి నిర్వహణ నిర్లక్ష్యంగా ఉండటంతో పలుమార్లు ఉన్నత అధికారులు హెచ్చరించినా తీరు మారకపోవడంతో సస్పెండ్ చేశారు. కొద్ది రోజులుగా ఇంటి వద్ద ఉంటున్న రాంబాబు తీసుకున్న రుణాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News November 6, 2025
హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.1500 ఫైన్ విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్ గురువారం తీర్పు చెప్పారు. మణుగూరు(M) పీవీ కాలనీకి చెందిన సూరపాక రామనాథం(60)ను అదే కాలనీకి చెందిన చెవుల సురేష్ మద్యం మత్తులో కర్రతో కొట్టి చంపారు. కుమారుడు శివకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. 11 మంది సాక్షులను విచారించగా సురేష్ పై నేరం రుజువు కావడంతో ఈ రోజు శిక్ష పడింది.


