News February 12, 2025
ASF జిల్లాలో అడ్వర్టైజ్ మందులు స్వాధీనం

మిస్ లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ ఉన్న మందులను విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆసిఫాబాద్ జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ అశ్విని అన్నారు. కాగజ్‌నగర్‌లో సోడియం ఫాస్పేట్ ఎనిమ బి.పి. 100 మి.లీ. చట్టం 1954 ప్రకారం సీజ్ చేశామన్నారు. లేబుల్స్ పైన మూర్చ రోగానికి పనిచేస్తుందని ముద్రించిన కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News November 8, 2025
VKB: రైతులు దళారుల బారిన పడొద్దు: అదనపు కలెక్టర్

రైతులు పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోవద్దని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ సూచించారు. తాండూర్‌లో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడుతూ.. వరి ధాన్యానికి ఏ గ్రేడ్‌కు రూ.2389, సన్న రకాలకు రూ.2369తో పాటు బోనస్‌గా రూ.500 చెల్లిస్తామని, సాధారణ రకాలకు రూ.2369 మద్దతు ధర ఇవ్వనున్నట్లు తెలిపారు. మొక్కజొన్నకు కూడా రూ.2400 మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
News November 8, 2025
పెట్టుబడుల సదస్సుకు భారీ ఏర్పాట్లు

AP: విశాఖలో ఈ నెల 14, 15 తేదీల్లో జరిగే పెట్టుబడుల సదస్సు కోసం శరవేగంగా భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. AU ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండులో 8 హాళ్లను సిద్ధం చేస్తున్నారు. సమ్మిట్ ప్రారంభోత్సవానికి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరుకానున్నారు. సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో పాటు 33 దేశాల వాణిజ్య మంత్రులు పాల్గొంటారు. ప్రాంగణంలో 1,600 మంది ప్రముఖులు కూర్చునేలా ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.
News November 8, 2025
VKB: ముత్యాల పందిరి వాహనంపై ఊరేగింపు

అనంత పద్మనాభ స్వామి కార్తీక మాస పెద్ద జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం అనంత పద్మనాభ స్వామిని ముత్యాల పందిరి వాహనంపై పురవీధుల్లో ఊరేగించారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారికి పూజలు నిర్వహించి పల్లకీ సేవలో పాల్గొన్నారు.


