News March 22, 2026
ASF జిల్లాలో పోలీసుల వసూళ్ల దందా?

జిల్లాలో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మద్యం వ్యాపారుల వద్ద నెలకు రూ.1.15లక్షలు, ఇసుక ట్రాక్టర్ల యజమానుల నుంచి రూ.5వేల వరకు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కిరాణా వ్యాపారులను సైతం వదలకుండా హఫ్తాల కోసం వేధిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఓ CI, మరో డివిజన్ స్థాయి అధికారి వ్యాపారులను పిలిపించి వసూలు చేస్తున్నారని బాధితులు DGP శివధర్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
Similar News
News April 13, 2026
గద్వాల: హెల్మెట్ లేకుండా కలెక్టరేట్‌కు రావొద్దు: కలెక్టర్

కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది ద్విచక్ర వాహనాలపై వచ్చేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో వచ్చే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ‘అరైవ్ అలైవ్’ వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిబంధనలు పాటించి అందరికీ ఆదర్శంగా నిలవాలని ఆయన సూచించారు.
News April 13, 2026
PGRSకు 80 అర్జీలు: ఎస్పీ

పుట్టపర్తిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన PGRSకు 80 పిటీషన్లు వచ్చినట్లు ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. ప్రతి పిటిషనర్ సమస్యను విని పరిష్కారానికి ఆదేశాలు ఇచ్చారు. ప్రజల సమస్యను పరిష్కరించే దిశగా పోలీసులు ఉన్నారని భరోసా కల్పించాలని సూచించారు. ముఖ్యంగా కుటుంబ కలహాలు, రస్తా సమస్యలు, ఆన్‌లైన్ మోసాలు, ఆర్థిక నేరాలు తదితర సమస్యలపై బాధితులు అర్జీలు ఇచ్చినట్లు తెలిపారు.
News April 13, 2026
PGRSలో 169 పిటిషన్లు స్వీకరించాం: SP జగదీష్

అనంతపురం పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 169 పిటిషన్లు వచ్చినట్లు ఎస్పీ జగదీష్ తెలిపారు. వారి సమస్యలను తెలుసుకుని పోలీసు అధికారులకు ఫోన్ చేసి, ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. దంపతుల మధ్య గొడవలు, కుటుంబ సమస్యలు, రస్తా వివాదాలు తదితర అంశాలపై ఫిర్యాదులు అందాయన్నారు.


