News March 2, 2026

ASF జిల్లాలో 54 హాట్‌స్పాట్‌ల గుర్తింపు: SP

image

ASF జిల్లా వ్యాప్తంగా ఫిబ్రవరి నెలలో షీ టీమ్‌ ద్వారా 54 హాట్‌స్పాట్ ప్రదేశాలను గుర్తించినట్లు జిల్లా ఎస్పీ నితికా పంత్ తెలిపారు. విద్యార్థులకు 19 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, 2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, 4 రెడ్‌ హ్యాండెడ్ కేసులు నమోదు చేశామన్నారు. వాట్సాప్ ద్వారా 2 ఫిర్యాదులు స్వీకరించామని చెప్పారు. హరాస్మెంట్‌కు గురైతే ASF: 8712670564, కాగజ్‌నగర్: 8712670565కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

Similar News

News March 2, 2026

NRPT: ప్రజావాణిలో వచ్చే అర్జీలను వెంటనే పరిష్కరించాలి

image

ప్రజావాణిలో అందిన అర్జీలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ ఫణీందర్ రెడ్డి అన్నారు. సోమవారం నారాయణపేట కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొత్తం 21 ఫిర్యాదులు అందినట్లు చెప్పారు. అర్జీలు పెండింగ్ పెట్టకుండా వెంటనే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

News March 2, 2026

NGKL: లైసెన్స్ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి

image

నాగర్‌కర్నూల్ జిల్లా లైసెన్స్ సర్వేయర్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా సర్వే అధికారి గిరిధర్ సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. జిల్లా అధ్యక్షుడు మల్లేష్ మాట్లాడుతూ.. జిల్లాలోని ఉన్నటువంటి లైసెన్స్ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించి ఆర్థిక భరోసా, భద్రతను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్, దినేష్ మల్లికార్జున్, అరవింద్, శివుడు ప్రశాంత్, శ్రీకాంత్, రమేష్, సుమంత్ సర్వేయర్లు పాల్గొన్నారు.

News March 2, 2026

ఆదిలాబాద్: ప్రజావాణి కార్యక్రమంలో అర్జీల స్వీకరణ

image

ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ రాజర్షిషా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల అర్జీలను స్వీకరించారు. అధికారులు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆర్డీవో స్రవంతి, డీఆర్డీవో రవీందర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది ఉన్నారు.