News January 6, 2026
ASF జిల్లా పరిధిలో చైనా మాంజా పూర్తిగా నిషేధం: ఎస్పీ

ఆసిఫాబాద్ జిల్లా పరిధిలో చైనా మాంజాను పూర్తిగా నిషేధించినట్లు జిల్లా నితిక పంత్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం విధించిన నిషేధాన్ని ఉల్లంఘిస్తూ చైనా మాంజాను విక్రయించినా, వినియోగించినా లేదా దాని వల్ల ఎవరికైనా ప్రమాదం సంభవించినట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాబోయే సంక్రాంతి పండుగను దృష్టిలో ఉంచుకుని జిల్లా వ్యాప్తంగా దృష్టి పెట్టామన్నారు.
Similar News
News January 10, 2026
గాడిపల్లి-రంగశాయిపేట రోడ్డు కోసం భూసేకరణ!

మామునూర్ ఎయిర్‌పోర్టు కారణంగా మూసివేతకు గురవుతున్న రంగశాయిపేట-గాడిపల్లి రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మరో రోడ్డు నిర్మాణానికి భూసేకరణకు అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు. గాడిపల్లి నుంచి నక్కలపల్లి, దున్నాల కాలనీ, అక్షర టౌన్ షిప్, బొల్లికుంట చెరువు రోడ్ మీదుగా ఖమ్మం రోడ్డును కలిపేందుకు 5.50కి.మీ రోడ్డు కోసం 36.28ఎకరాలను సేకరించాలని నిర్ణయించారు. రూ.95 కోట్లను మంజూరు చేయాలని R&Bఅధికారులు నివేదిక పంపారు.
News January 10, 2026
సూళ్లూరుపేట: పక్షుల పండుగ.. నేటి కార్యక్రమాలు

ఉ. 9 గంటలు: S.పేట హోలీక్రాస్ సర్కిల్ నుంచి కళాశాల మైదానం వరకు శోభాయాత్ర
9.30- 12 : పక్షుల పండుగ, స్టాళ్ల ప్రారంభం
సా.5 : సాంస్కృతిక కార్యక్రమాలు, ఫ్లెమింగోపై పాటకు డాన్స్, పులికాట్ సరస్సు, నేలపట్టు పక్షుల రక్షితకేంద్రం, పులికాట్ సరస్సులో వేట విన్యాసాలపై వీడియో ప్రదర్శన, లైటింగ్ ల్యాంప్
సా.6.30కి ఫ్లెమింగో ఫెస్టివల్ 2026 ఆవిష్కరణ
సా.7గంటలకు అతిథుల ప్రసంగాలు
సా.7.30-10 గంటల వరకు పాటకచ్చేరి, డాన్స్
News January 10, 2026
గుంటూరులో నేటి నుంచి UTF రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నేటి నుంచి గుంటూరులో ప్రారంభం కానున్నాయి. రెండ్రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలకు గుంటూరు ఆంధ్రా క్రైస్తవ కళాశాల వేదికగా నిలవనుంది. పీడీఎఫ్ ఎమ్మెల్సీలతో పాటూ, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు ఈ సమావేశాల్లో పాల్గొననున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను నిర్వాహకులు ఇప్పటికే పూర్తి చేశారు.


