News April 4, 2025

ASF జిల్లా మైనార్టీ సంక్షేమ ఇన్‌ఛార్జ్‌ అధికారిగా నదీమ్

image

ఆసిఫాబాద్ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా ఇన్‌ఛార్జ్‌ అధికారిగా అబ్దుల్ నదీమ్ ఖుద్దూసీ నియమితులయ్యారు. నదీమ్ జిల్లా హార్టికల్చర్ (ఉద్యానవన ) అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఇన్‌ఛార్జ్ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

Similar News

News February 11, 2026

అనుదీప్ మళ్లీ అలరించేనా?

image

కామెడీ సినిమాల్లో ‘జాతిరత్నాలు’ ట్రెండ్ సెట్ చేసింది. కానీ ఆ తర్వాత డైరెక్టర్ అనుదీప్ నుంచి ఆ స్థాయి సినిమా రాలేదు. ఇప్పుడు విశ్వక్‌సేన్ హీరోగా ఆయన డైరెక్ట్ చేసిన ‘ఫంకీ’ ఈ నెల 13న రిలీజ్ కానుంది. ఈ మూవీతో అభిమానులను అలరిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తాను చెప్పాల్సిన కథలు చాలా ఉన్నాయని చెబుతున్న ఈ డైరెక్టర్ ఫంకీతో అలరిస్తారో లేదో చూడాలి.

News February 11, 2026

NZB: పోటీలో మొత్తం 714 మంది అభ్యర్థులు: కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లాలోని కార్పొరేషన్, మూడు మున్సిపాలిటీలలో మొత్తం 714 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఇలా త్రిపాఠి వివరించారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. అత్యధికంగా నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 350 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. బోధన్‌లో 162 మంది, ఆర్మూర్‌లో 153 మంది, భీంగల్‌లో 49 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని వెల్లడించారు.

News February 11, 2026

అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్‌షాను కోరిన CM

image

ఢిల్లీ పర్యటనలో భాగంగా CM చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సహా ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. వివిధ ప్రాజెక్టులపై విజ్ఞాపన పత్రాలు అందజేశారు. రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అమిత్‌షాకు విజ్ఞప్తి చేశారు. APలో మఖానా డెవలప్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని శివరాజ్ సింగ్ చౌహా‌న్‌ను కోరారు. పోలవరం రెండో దశకు రూ.32 వేలకోట్లు అవసరమని జలశక్తి శాఖ మంత్రి CR పాటిల్‌కు విజ్ఞప్తి చేశారు.