News January 3, 2026
ASF జిల్లా సర్పంచులకు శిక్షణ

ఆసిఫాబాద్ జిల్లాలోని సర్పంచులకు 2026 సంవత్సరానికి సంబంధించి శిక్షణ కార్యక్రమం నిర్వహించన్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఓ ప్రకటన విడుదల చేశారు. జనవరి 6 నుంచి 12వ తేదీ వరకు యోగా, కళా మేళా, మానసిక శిక్షణ, పర్యటన, లక్ష్యసాధన, సేవా భావం వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సర్పంచులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు.
Similar News
News February 18, 2026
విశాఖ: ‘సముద్ర సంప్రదాయాల పట్ల ఐక్యతకు నిదర్శనం ఫ్లీట్ రివ్యూ’

అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. ఈ కార్యక్రమం సముద్ర సంప్రదాయాల పట్ల దేశాల మధ్య ఉన్న ఐక్యత, గౌరవానికి చిహ్నమని ఆమె పేర్కొన్నారు. ప్రపంచ దేశాల నౌకాదళాల సమిష్టి కృషి వల్ల సముద్ర మార్గాలు ప్రపంచాభివృద్ధికి, శ్రేయస్సుకు, మానవాళి సంక్షేమానికి కీలకమైన ద్వారాలుగా మారుతాయని రాష్ట్రపతి ఈ సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.
News February 18, 2026
వేములవాడ: మహిళ అనుమానాస్పద మృతి..!

వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రాంతానికి చెందిన వెంగళ రోహిణి (32) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. కథలాపూర్ మండలానికి చెందిన రోహిణికి వెంగళ దినేష్‌తో 8 సంవత్సరాల క్రితం వివాహం కాగా ఇద్దరు సంతానం ఉన్నారు. బుధవారం తెల్లవారుజామున ఉరివేసుకుందని, ఆసుపత్రికి తీసుకువెళ్లేలోగా రోహిణి మరణించిందని స్థానికులు తెలిపారు.
News February 18, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారు, వెండి ధరల వివరాలు.
* 24 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర రూ.14,140
* 10 గ్రాములు వెండి ధర రూ.2,460.


