News August 13, 2025

ASF: జూబ్లీ మార్కెట్‌కు జలగండం

image

ఆసిఫాబాద్ జిల్లాకేంద్రంలోని రాజంపేట జూబ్లీ మార్కెట్ భారీ వర్షాలకు జలమయమైంది. కూరగాయలు, చికెన్, మటన్, చేపల దుకాణాలున్న ఈ మార్కెట్‌లో నీరు నిలవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. గతేడాది నుంచి ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని వ్యాపారులు వాపోయారు. మార్కెట్‌లోకి నీరు రాకుండా సైడ్ డ్రైనేజీలు నిర్మించాలని కోరుతున్నారు.

Similar News

News August 14, 2025

మంచిర్యాల జిల్లాలో మంత్రి వర్సెస్ MLA

image

జిల్లాలో ఓరియంట్ సిమెంట్ కంపెనీ కార్మిక సంఘం ఎన్నికల వేడి రాజుకుంది. ఈనెల 19న పోలింగ్ జరుగనుండగా బరిలో ఉన్న అభ్యర్థులు కార్మిక వాడల్లో విస్తృత ప్రచారం చేపట్టారు. మంత్రి వివేక్ వర్గం నుంచి విక్రమ్‌రావు, మంచిర్యాల ఎమ్మెల్యే మద్దతుతో సత్యపాల్‌రావు, ప్రధాన అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. మంత్రి, ఎమ్మెల్యే మధ్య నెలకొన్న కోల్డ్ వార్‌తో ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. ఇరువర్గాల్లో గెలుపు ధీమా కనిపిస్తోంది.

News August 14, 2025

నంద్యాల జిల్లాలో అత్యధిక వర్షం ఇక్కడే..!

image

నంద్యాల జిల్లాలోని 30 మండలాల్లో వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొత్తపల్లె మండలంలో అత్యధికంగా 40.6 మి.మీ వర్షపాతం నమోదైంది. బండిఆత్మకూరు 34 మి.మీ, శ్రీశైలం 29.2 మి.మీ, ఆత్మకూరు 23.6 మి.మీ, పగిడ్యాల 22.8 మి.మీ, గడివేముల 18.2 మి.మీ, నంద్యాల అర్బన్ 15.6 మిమీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యల్పంగా చాగలమర్రి మండలంలో 2.2 మి.మీ వర్షం పడింది.

News August 14, 2025

ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి: CBN

image

AP: పులివెందుల ZPTC ఉపఎన్నికలో TDP ఘనవిజయం సాధించడంపై CM చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ‘ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి కాబట్టే 11 మంది నామినేషన్లు వేశారు. పులివెందుల కౌంటింగ్‌లో 30 ఏళ్ల తర్వాత ఓటు వేశామనే స్లిప్పులు పెట్టారు. అంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయనేది ఆలోచించాలి. జగన్ అరాచకాల నుంచి పులివెందుల ప్రజలు ఇప్పుడే బయటపడుతున్నారు. ఈ విజయం పట్ల నేతలంతా స్పందించాలి’ అని CM ఆదేశించారు.