News April 4, 2025
ASF: డిగ్రీ విద్యార్థులకు GOOD NEWS

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ 2, 4, 6 సెమిస్టర్ల పరీక్ష ఫీజు చెల్లింపు గడువును KU అధికారులు పొడిగించిన విషయం తెలిసిందే. కాగా వీటితో పాటు 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు సైతం రాసేందుకు అవకాశం కల్పించినట్లు KU అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో 1, 3, 5 పరీక్ష ఫీజును ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 11 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News October 28, 2025
కురుమూర్తి జాతర.. భారీ బందోబస్తు- SP

మహబూబ్‌నగర్ జిల్లా ‘చిన్న తిరుపతి’గా ప్రసిద్ధి గాంచిన కురుమూర్తి స్వామి జాతర సందర్భంగా భక్తుల రక్షణ,శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ డీ.జానకి తెలిపారు. మొత్తం 680 మంది పోలీసు సిబ్బందిని మోహరించామని, జాతర ప్రాంగణం మొత్తం సీసీ కెమెరాల నిగ్రహంలో ఉండి, 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటే వెంటనే కంట్రోల్ రూమ్‌లో తెలుపాలన్నారు.
News October 28, 2025
HYD: ఇంటింటికీ వెళ్లి మాగంటి సునీత ప్రచారం

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో వెంగళరావునగర్ డివిజన్ పరిధిలో బీఆర్ఎస్ నేతలు ఈరోజు ప్రచారం చేపట్టారు. సిద్ధార్థనగర్ ఏజీ కాలనీలో జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఇంటింటికీ తిరుగుతూ ప్రచారం చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ ఎంతో అభివృద్ధి చేశారని గుర్తుచేశారు. BRSకు ఓటు వేసి, తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
News October 28, 2025
రేపు పోలీసు శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం: SP

పోలీసు స్మారక దినోత్సవం సందర్భంగా మంగళవారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు SP సుబ్బరాయుడు తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మంగళం ఆర్టీవో ఆఫీస్ ఎదురుగా ఉన్న ఆశా కన్వెన్షన్ హాల్లో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పోలీసులు రక్తదానం చేయనున్నట్లు స్పష్టం చేశారు.


