News October 26, 2025

ASF: డీసీసీ.. అందరి చూపూ ఢిల్లీ వైపు..!

image

ఆసిఫాబాద్ జిల్లాలో డీసీసీల ఎన్నిక అంశం ఆసక్తి రేపుతోంది. అధికార పార్టీలో గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ సారి కొత్త నిబంధనలు, ఎంపిక విధానాల తీరు మారింది. దీంతో ఎవరిని అధ్యక్ష పీఠం వరిస్తుందో అనే చర్చ పార్టీ శ్రేణుల్లో మొదలైంది. తుది ఎంపిక ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. గతంలో స్థానిక ఎమ్మెల్యేలు, సీఎం, పీసీసీ చీఫ్ తుది నిర్ణయమే ఫైనల్‌గా ఉండేది.

Similar News

News October 26, 2025

వైద్యురాలు ఆత్మహత్య.. BJPపై రాహుల్ ఫైర్

image

మహారాష్ట్రలో SI రేప్ చేశాడని వైద్యురాలు <<18091644>>సూసైడ్<<>> చేసుకోవడంపై LoP రాహుల్‌గాంధీ స్పందించారు. ‘ఎలాంటి సివిలైజ్డ్ సొసైటీనైనా కదిలించే విషాదమిది. అవినీతి వ్యవస్థలో స్థిరపడిన క్రిమినల్స్ చేతిలో ఆమె బలైంది. ప్రజలను రక్షించాల్సినవారే ఘోరానికి పాల్పడ్డారు. దీని వెనుక BJP నేతలు, సంపన్నులు ఉన్నట్లు సమాచారం. ప్రభుత్వ అమానవీయ ముఖాన్ని ఇది బయటపెట్టింది. దేశంలోని ప్రతి ఆడబిడ్డకు అండగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.

News October 26, 2025

వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

image

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్‌పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News October 26, 2025

JNTU: OTPRIలో 31న ప్రాంగణ నియామకాలు

image

అనంతపురం జేఎన్టీయూ OTPRIలో ఈ నెల 31న ఉదయం 9:00 గంటలకు B.Pharm, M.Pharm విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నట్లు OTPRI డైరెక్టర్ సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ సి.గోపినాథ్ ఆదివారం తెలిపారు. 2022-25లో గ్రాడ్యుయేషన్ (B.Pharm, M.Pharm) పూర్తి చేసుకునే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.