News April 21, 2025
ASF: తల్లి, భార్య మందలించిందని సూసైడ్

మద్యం తాగొద్దని తల్లి, భార్య మందలించడంతో వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన వాంకిడి మండలంలో చోటు చేసుకుంది. వాంకిడి ఎస్సై ప్రశాంత్ కథనం ప్రకారం.. ఇందాని గ్రామానికి చెందిన లచ్చుంబాయి చిన్న కుమారుడు సంతోశ్ మద్యానికి బానిసయ్యాడు. తల్లి, భార్య కల్పన మందలించడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 21, 2025
పోచంపల్లిలో అందాల భామల ర్యాంప్‌వాక్!

TG: మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే అందాల భామలు చేనేత వస్త్రాలకు ప్రసిద్ధి చెందిన భూదాన్ <<16153019>>పోచంపల్లిలో<<>> పర్యటించనున్న విషయం తెలిసిందే. ‘తెలంగాణ హ్యాండ్లూమ్ థీమ్’ పేరుతో మే 15న అక్కడ నిర్వహించనున్న కార్యక్రమంలో ఇక్కత్ పట్టుచీరలు ధరించి ర్యాంప్‌వాక్ చేయనున్నారు. అనంతరం చేనేత కార్మికులతో ముఖాముఖిలో పాల్గొంటారు. గద్వాల్ సిల్క్, గొల్లభామ కాటన్, నారాయణపేట వస్త్రాల స్టాల్స్‌ను అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.
News April 21, 2025
కడపలో భగ్గుమన్న భానుడు

కడప జిల్లాలో ఆదివారం భానుడు నిప్పులు కురిపించాడు. జిల్లాలో 36 మండలాలు ఉండగా, అందులో 28 మండలాల్లో 40 డిగ్రీల నుంచి 42.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముద్దనూరు మండలంలో అత్యధికంగా 42.3 డిగ్రీలు, బద్వేలులో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. వేడిగాలి, ఉక్కపోతులతో ప్రజలు అల్లాడిపోయారు. వృద్ధులు, చిన్నారులు ఎండలతో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
News April 21, 2025
సీలేరులో ఇద్దరు యువకులు గల్లంతు

చింతూరు మండలం కల్లేరు వద్ద సీలేరు నదిలో ఇద్దరు యువకులు ఆదివారం గల్లంతయ్యారు. చింతూరుకి చెందిన శ్రీను, ప్రదీప్ గల్లంతయినట్లు స్థానికులు తెలిపారు. స్నానం చేయడానికి సీలేరు నదిలో దిగిన ప్రవాహానికి కొట్టుకుపోవడంతో అతన్ని రక్షించుకోవడం కోసం నదిలో దిగిన మరొక యువకుడు గల్లంతైనట్లు సమాచారం. స్థానికులు చింతూరు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.