News March 2, 2026
ASF: దివ్యాంగులకు ఇక ఉచిత బస్సు ప్రయాణం

కొమరం భీమ్ జిల్లాలోని దివ్యాంగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రవ్యాప్తంగా లింగభేదం లేకుండా దివ్యాంగులందరికీ ఆర్టీసీ బస్సుల్లో పూర్తి స్థాయి ఉచిత ప్రయాణాన్ని కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో విద్య, వైద్యం, ఉపాధి నిమిత్తం ప్రయాణించే వారికి భారీ ఉపశమనం లభించనుంది. చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు జిల్లాలోని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News March 2, 2026
వనపర్తి: జిల్లా వ్యాప్తంగా “30 పోలీస్ యాక్ట్” అమలు

జిల్లాలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, ప్రజల సాధారణ జీవనాన్ని నిరంతరాయంగా కొనసాగించడం, అనవసర గుమికూడింపులు నివారించడం లక్ష్యంగా మార్చి 1 నుంచి మార్చి 31 వరకు 30 పోలీస్ యాక్ట్–1861 అమల్లో ఉంటుందని ఎస్పీ సునిత రెడ్డి తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లా పరిధిలో ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, ర్యాలీలు, బహిరంగ సభలు, భారీ స్థాయి సమావేశాలు నిర్వహించరాదన్నారు.
News March 2, 2026
కొమురం భీం జిల్లా మోడల్ స్కూల్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు

కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ పరిధిలోని తెలంగాణ మోడల్ స్కూల్స్‌లో 2026- 27 విద్యా సంవత్సరానికి VI తరగతి ప్రవేశాలు, VII నుంచి X తరగతుల్లో ఖాళీ సీట్లకు నిర్వహించే అడ్మిషన్ టెస్ట్ దరఖాస్తుల గడువు మార్చి 10 వరకు పొడిగించారు. అభ్యర్థులు సీజీజీ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. OCలకు రూ.200, BC/ SC/ ST/ PHC/ EWSలకు రూ.125 ఫీజు నిర్ణయించారు. పరీక్షలు సంబంధిత మండల కేంద్రాల్లో నిర్వహిస్తారు.
News March 2, 2026
MNCL: సీనియర్ సిటిజన్ కార్డుల మంజూరు నిలిపివేత

మంచిర్యాల జిల్లాలో వయోవృద్ధులకు సంబంధించిన సీనియర్ సిటిజన్ కార్డులు మంజూరు చేయడాన్ని ప్రభుత్వ ఆదేశాల మేరకు నిలిపివేసినట్లు జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్ తెలిపారు. సీనియర్ సిటిజన్ కార్డుల వల్ల ఎలాంటి ఉపయోగం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలు కోసం ఆధార్ కార్డు వినియోగించుకోవాలని ఆయన సూచించారు.


