News March 13, 2025
ASF: ధరణి పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

వివిధ భూ సమస్యలపై ధరణి పోర్టల్‌లో అందిన దరఖాస్తులలో పెండింగ్ ఉన్నవాటిని త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి అన్ని మండలాల తహశీల్దార్లతో ధరణిలో వచ్చిన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ధరణి పోర్టల్‌లో భూ సమస్యలపై వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రికార్డులను సరిచూసి పరిష్కరించాలాన్నారు.
Similar News
News November 21, 2025
కొత్తవలస MRO అప్పలరాజు సస్పెండ్

కొత్తవలస MRO పి.అప్పలరాజును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కొత్తవలస మండలంలోని చిన్నపాలెం, కింతలపాలెం, కొత్తవలస గ్రామాల్లో భూములకు సంబందించి మ్యుటేషన్లు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయంటూ PGRS ద్వారా కలెక్టర్‌కు స్థానికులు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ డిప్యూటీ తహశీల్దార్‌గా ఉన్న సునీతకు ఇన్‌ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు.
News November 21, 2025
ఆ సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దు: TTD

AP: శ్రీవారి భక్తులను తప్పుదోవ పట్టించే సంస్థలకు విరాళాలు ఇవ్వొద్దని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు విజ్ఞప్తి చేశారు. తిరుమల, తిరుపతి, తిరుచానూరులను పుణ్యక్షేత్రాలుగా ప్రకటించేందుకు NOV 29న ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు Global Hindu Heritage, savetemples.org సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. అవి మోసపూరితంగా విరాళాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 21, 2025
JGTL: ‘కలివి వనం’ దర్శకుడి స్వగ్రామంలో సందడి

నేడు విడుదల కానున్న ‘కలివి వనం’ దర్శకుడు పూసాల రాజ్ నరేంద్ర స్వగ్రామం జగిత్యాల జిల్లాలోని జగ్గాసాగర్. దీంతో ఆ గ్రామంలో ఆనందం నెలకొంది. కాగా, ఈ సినిమా పాటలు ఇప్పటికే మంచి ఆదరణను పొందడంతో గ్రామస్థులు గర్వంగా ఫీలవుతున్నారు. ఈ సందర్భంగా గ్రామపెద్దలు మాట్లాడుతూ.. రాజ్ నరేంద్ర గ్రామానికి తెచ్చిన పేరు అభినందనీయం అన్నారు. గ్రామ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న దర్శకుడిని గ్రామస్థులు అభినందించారు.


