News March 20, 2025
ASF: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నేడే JOB MELA

నిరుద్యోగులకు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గుడ్ న్యూస్ చెప్పారు. గురువారం పట్టణంలోని రోజ్ గార్డెన్లో 1000 ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఆమె బుధవారం తెలిపారు. దేశంలోని ప్రముఖ కంపెనీలైన(SSKD, ఫాక్స్‌కాన్, యాపిల్ సంస్థ)లో అర్హత కలిగి ఉన్న నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నామన్నారు. నిరుద్యోగ యువతులు హాజరై విజయవంతం చేయాలన్నారు.
Similar News
News November 4, 2025
విశాఖలో భూప్రకంపనలు

AP: విశాఖలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 4.30 గంటల మధ్య పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. విశాఖలోని గాజువాక, మధురవాడ, రుషికొండ, భీమిలి, కైలాసపురం, మహారాణిపేట, విశాలాక్షినగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. కొన్నిచోట్ల శబ్దాలు కూడా వచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు. మీ ప్రాంతంలోనూ భూకంపం వచ్చినట్లు అనిపించిందా? కామెంట్ చేయండి.
News November 4, 2025
రబ్బర్ బోర్డ్‌లో 51 పోస్టులకు నోటిఫికేషన్

<
News November 4, 2025
కాకినాడ: జిల్లా అధికారులకు పవన్ కళ్యాణ్ ఆదేశాలు

కాశీబుగ్గ తొక్కిసలాట నేపథ్యంలో కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన అన్నవరం, పిఠాపురం, సామర్లకోటలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు. సోమవారం ఆయన వారితో ఫోన్లో మాట్లాడారు. కాశీబుగ్గ తొక్కిసలాట దృష్ట్యా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఆలయాలపై నిరంతరం ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.


