News January 23, 2026

ASF: నేడు జూనియర్ కళాశాలల్లో ‘మెగా పేరెంట్స్ మీటింగ్’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో శుక్రవారం మెగా పేరెంట్స్ మీటింగ్ నిర్వహించనున్నట్లు DIEO రాందాస్ తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలల్లో చదివి ఉన్నత ఉద్యోగాలు సాధించిన పూర్వ విద్యార్థులను ఘనంగా సత్కరించనున్నారు. విద్యార్థుల విద్యా ప్రగతి, పరీక్షల ఫలితాలు, కళాశాలల్లో మౌలిక వసతులపై తల్లిదండ్రులతో చర్చించనున్నారు. ఈ కార్యక్రమానికి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.

Similar News

News February 15, 2026

NRPT: ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఎకనామిక్ కారిడార్

image

మహబూబ్‌నగర్ జిల్లా అభివృద్ధికి కీలకంగా భావిస్తున్నHYD –పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా గుడెబల్లూర్–MBNR జాతీయ రహదారి (NH–167) విస్తరణ పనులు వేగంగా సాగుతున్నాయి. రూ.3,175 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో సుమారు 80 కిలోమీటర్ల మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణం జరుగుతోంది. ఈ రహదారి ద్వారా NRPT, మక్తల్, దేవరకద్ర ప్రాంతాలకు మెరుగైన రవాణా సౌకర్యాలు లభించనున్నాయి. నగరాలకు ప్రయాణ సమయం తగ్గనుంది.

News February 15, 2026

రష్యా నుంచి ఆయిల్ బంద్.. జైశంకర్ రిప్లై ఇదే

image

రష్యా నుంచి క్రూడాయిల్ కొనబోమని ఇండియా <<19145614>>హామీ<<>> ఇచ్చినట్లు US చెబుతున్న నేపథ్యంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ తన స్వతంత్ర నిర్ణయాధికారానికే (Strategic Autonomy) కట్టుబడి ఉంటుందని తేల్చి చెప్పారు. ఆయిల్ మార్కెట్ చాలా కాంప్లెక్స్‌గా ఉంటుందని.. ధర, రిస్క్‌లు, అవైలబిలిటీని బట్టి ఆయిల్ కంపెనీలు కొనుగోళ్లు చేపడతాయని వివరించారు.

News February 15, 2026

వేములవాడ: 255 మంది సిబ్బందితో వైద్య శిబిరాల ఏర్పాటు

image

మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలో 256 మంది సిబ్బందితో పలుచోట్ల వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జాతర జరిగే ప్రాంతాలతో పాటు ప్రధాన ఆలయాల సమీపంలో అత్యవసర సమయాలలో చికిత్స కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. 9 చోట్ల వైద్య శిబిరాలు, ఆరు ప్రత్యేక బృందాలను నిరంతర వైద్య సేవలను అందించేందుకు సిద్ధంగా ఉంచారు. అత్యవసర సమయాలలో వైద్య చికిత్స కోసం సిద్ధంగా ఉన్నామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత తెలిపారు.