News October 7, 2025
ASF: పశువులను రోడ్లపై వదిలితే చర్యలు

ఆసిఫాబాద్ మున్సిపల్ కమిషనర్ గజానంద్ రోడ్లపైకి పశువులను వదిలే యజమానులకు సూచనలు చేశారు. పశువులను రాత్రిపూట, పగటిపూట రోడ్లపైన వదలకుండా చూసుకోవాలన్నారు. పశువులను రోడ్ల పైన వదలడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. యజమానులు పశువులను వారి సంరక్షణలో ఉంచుకోవాలని లేని పక్షంలో జరిమానాలు విధించడంతో పాటు పురపాలక చట్టం 2019 ప్రకారం చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News October 7, 2025
నవీన్ యాదవ్‌పై సోదరుడి భార్య సంచలన లేఖ

TG: జూబ్లీహిల్స్ బైపోల్‌లో INC అభ్యర్థి రేసులో ఉన్న నవీన్ యాదవ్‌కు మరో షాక్ తగిలింది. భర్తతో పాటు కుటుంబీకులు తనను వేధిస్తున్నారంటూ నవీన్ సోదరుడు వెంకట్ భార్య మహితాశ్రీ మీనాక్షీ నటరాజన్‌కు రాసిన లేఖ SMలో వైరల్ అవుతోంది. రౌడీషీటర్ బ్యాక్‌డ్రాప్ ఉన్న నవీన్ లాంటివారికి రాజకీయాల్లో స్థానం కల్పించడంతో ప్రజలకు ముప్పు వాటిల్లుతుందన్నారు. ఓటర్ కార్డులు పంచారని <<17935833>>ఇప్పటికే<<>> నవీన్‌పై క్రిమినల్ కేసు నమోదైంది.
News October 7, 2025
కీటక జనిత వ్యాధుల నియంత్రణపై చర్యలు చేపట్టాలి : DMHO

పెద్దపల్లి జిల్లా DMHO డా. వాణిశ్రీ రాగినేడు మంగళవారం గర్రెపల్లిలో ఆశ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించారు. ప్రతి ఆశ 30 ఇళ్లు సందర్శించి దోమల లార్వా నిల్వలు తొలగించాలని, ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని ఆదేశించారు. గర్భిణీ స్త్రీల నమోదు, జ్వరాల సర్వే, క్షయ నియంత్రణ వంటి ప్రభుత్వ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలని ఆమె సూచించారు.
News October 7, 2025
సంగారెడ్డి జిల్లాలో భూసేకరణ వేగవంతం చేయాలి: కలెక్టర్

జిల్లాలో భూ సేకరణ వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఆర్ఆర్ఆర్ కింద భూసేకరణ వేగవంతం చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులకు పరిహారం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.