News March 10, 2025
ASF: పురుగుమందు తాగి ఆత్మహత్య

చింతలమానేపల్లి మండలం బూరేపల్లి గ్రామానికి చెందిన బాసనబోయిన తిరుపతి (32) ఆదివారం పురుగుమందు తాగి మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులకు సమాచారం అందించినట్లు చెప్పారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 12, 2025
సంగారెడ్డి: అన్నా 14 నాడు పక్కా రావాలే… నీ ఓటు నాకే.

సంగారెడ్డి జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం రేపటితో ముగుస్తుండటంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పట్టణాలు, ఇతర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు ఫోన్ చేసి “అన్నా, 14న తప్పకుండా రావాలె, నీ ఓటు నాకే” అంటూ కోరుతున్నారు. బస్సు ఛార్జీలు, ఇతర ఖర్చులు తామే చెల్లిస్తామని హామీ ఇస్తూ, ఓటర్లను తమ సొంతూళ్లకు రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
News December 12, 2025
రైతుల సమస్యలపై శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ధాన్యం సేకరణ, ఎరువులు సంబంధించి సమస్యలపై కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ గురువారం ఓ ప్రటన విడుదల చేశారు. రైతులకు ఏదైనా సమస్యలు ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 9121863788 ఫోన్ చేసి తెలుసుకోవాలని స్పష్టం చేశారు. రైతుల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.
News December 12, 2025
అనకాపల్లి జిల్లాలో మరో భారీ పరిశ్రమ

అచ్యుతాపురం ఎస్ఈజెడ్ పరిధిలో గల రాంబిల్లి మండలంలో సోలార్ పలకల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది. ఈ మేరకు పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం 150 ఎకరాలను కేటాయించింది. గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. రూ.3,990 కోట్ల పెట్టుబడితో దీనిని ఏర్పాటు చేయనున్నారు. 2028 జనవరి నాటికి ఉత్పత్తిని ప్రారంభిస్తుంది. 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.


