News August 17, 2025
ASF: పెండింగ్ కేసులు త్వరగా పూర్తిచేయాలి: ఎస్పీ

పెండింగులో ఉన్న కేసులు త్వరగా పూర్తి చేయాలని, మహిళల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. శనివారం కాగజ్ నగర్ పట్టణ పోలీస్ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు అందుబాటులో ఉండాలని, పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేయాలని, మత్తుపదార్థాల నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Similar News
News August 17, 2025
సంతకవిటి: నాగావళి నదిలో వృద్ధుడు గల్లంతు

బహిర్భూమికి వెళ్లి నాగవళి నదిలో ప్రమాదవశాత్తూ జారిపడి వృద్ధుడు గల్లంతైన ఘటన ఆదివారం సంతకవిటి మండలంలో జరిగింది. మండలంలోని పొడలి గ్రామానికి చెందిన ఉరదండ పోలయ్య (76) ఆదివారం ఉదయం కాలకృత్యాలు తీర్చుకునేందుకు నది తీరానికి వెళ్లాడు. ఎప్పటికీ రాకపోవడంతో వృద్ధుడి కోసం కుటుంబీకులు వెతికానా దొరకలేదు. అనంతరం వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు గాలింపు చేపట్టారు.
News August 17, 2025
రాజగోపాల్ రెడ్డి వినకపోతే వేటు తప్పదు: మల్లు రవి

TG: మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి <<17432060>>వ్యవహారాన్ని<<>> పీసీసీ చీఫ్ తమ దృష్టికి తీసుకువచ్చారని PCC క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ మల్లు రవి తెలిపారు. ఎంత చెప్పినా వినకుంటే రాజగోపాల్ రెడ్డిపై వేటు తప్పదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సరి చేస్తూ, అందరూ కలిసి పని చేసేలా చూసే బాధ్యత తనదేనన్నారు. వచ్చే మంగళవారం మరోసారి సమావేశమై రాజగోపాల్ రెడ్డి అంశంపై చర్చిస్తామని చెప్పారు.
News August 17, 2025
ఏలూరు: అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృత పెరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. ప్రజలెవ్వరూ నదిలోకి ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం వంటివి చేయవద్దన్నారు. అత్యవసర సమయంలో వినియోగం నిమిత్తం మోటార్ బోట్లు, గజ ఈతగాళ్లను సిద్ధం చేయాలన్నారు.