News February 23, 2026
ASF: పోలీస్ ప్రజావాణిలో 8 దరఖాస్తులు

ఆసిఫాబాద్ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ నితిక పంత్ సోమవారం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ASF జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి 8 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదుచేయాలని, వాటిపై తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు సూచించారు.
Similar News
News February 26, 2026
సాగునీటి ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం: కలెక్టర్

కాకతీయ కెనాల్ నిర్మాణ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ డా.సత్య శారద అధికారులను ఆదేశించారు. గురువారం జే.చొక్కారావు దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పురోగతిపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కెనాల్ పనులకు ఆటంకం కలగకుండా భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సాగునీటి సౌకర్యం మెరుగుపడితేనే వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని ఆమె పేర్కొన్నారు.
News February 26, 2026
భద్రాద్రి నూతన కలెక్టర్‌గా అంకిత్ బాధ్యతలు

భద్రాద్రి జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా అంకిత్ గురువారం సాయంత్రం 6:19 గంటలకు కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా బదిలీ అయిన కలెక్టర్ జితేష్ వి పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్ నూతన కలెక్టర్‌ను కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలోని అన్ని శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది హాజరై నూతన కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు.
News February 26, 2026
FLNAT పరీక్షకు హాజరుకావాలి: కలెక్టర్

విశాఖలో ఫిబ్రవరి 28న వయోజన విద్యార్థులకు ప్రీ-ఫైనల్ FLNAT పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉల్లాస్, అక్షరాంధ్ర పథకాల కింద 15 ఏళ్లు పైబడిన వారికి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఈ పరీక్ష జరుగుతుంది. 2029 నాటికి సంపూర్ణ అక్షరాస్యత సాధించడమే లక్ష్యమని, అర్హులైన వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు.


