News February 7, 2026
ASF: పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు

పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఆన్‌లైన్ నమోదు గడువును పొడిగించినట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి నదీమ్ శనివారం తెలిపారు. ప్రభుత్వ మైనారిటీల సంక్షేమ శాఖ కమిషనర్ సూచనలతో ప్రభుత్వ షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం 2025-26 విద్యా సంవత్సరానికి పోస్ట్ మెట్రిక్స్ స్కాలర్షిప్ దరఖాస్తు గడువును మార్చి 31 వరకు పొడిగించామన్నారు.
Similar News
News February 7, 2026
జనగామ: రెండో విడత ఇంటర్ ప్రాక్టికల్స్‌లో 97 మంది గైర్హాజరు

జనగామ జిల్లాలోని 10 పరీక్ష కేంద్రాల్లో శనివారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో విడత ప్రాక్టికల్ పరీక్షలకు 97 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈవో జితేందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 64 మంది, మధ్యాహ్నం 33 మంది గైర్హాజరు అయ్యారని వెల్లడించారు. జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీనివాస్, శేఖర్, జనగామ జిల్లా కేంద్రంలోని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు చెప్పారు.
News February 7, 2026
రేవంత్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాలేరు: KTR

TG: రేవంత్ ఎప్పటికైనా BJP మనిషేనని KTR ఎద్దేవా చేశారు. కామారెడ్డి(D) బాన్సువాడలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘రేవంత్ కాంగ్రెస్ నేత కాదు బడే భాయ్ తమ్ముడు. కాంగ్రెస్ నుంచి ప్రయోజనాలు పొందిన వాళ్లే వారికి ఓటేయాలి. తర్వాత మా ప్రభుత్వం వస్తుంది. కచ్చితంగా కాంగ్రెస్ కంటే గొప్పగా అభివృద్ధి చేస్తాం. ఆయన విసిరే ఎంగిలి మెతుకుల కోసం పోచారం కాంగ్రెస్ సంకలో దూరారు’ అని విమర్శించారు.
News February 7, 2026
పాలమూరు యూనివర్సిటీ LLM ఫీజు నోటిఫికేషన్ విడుదల

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని LLM మొదటి సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్షల ఫీజు షెడ్యూల్ విడుదలైంది. విద్యార్థులు ఈనెల 13 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని అధికారులు తెలిపారు. అలాగే రూ.300 అపరాధ రుసుంతో ఈనెల 16 వరకు చెల్లించాలన్నారు. పరీక్షల పూర్తి టైమ్ టేబుల్‌ను త్వరలోనే వెల్లడించనున్నారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.palamuruuniversity.comను చూడండి.


