News March 19, 2025

ASF: భారమంతా.. బడ్జెట్‌పైనే..!

image

రాష్ట్ర ప్రభుత్వం నేడు ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ASFజిల్లా ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్లో కొమురంభీమ్, జగన్నాథ్‌పూర్, వట్టివాగు ప్రాజెక్టులు, గుండి వాగు, వార్ధా నదిపై వంతెనల నిర్మాణాలకు నిధులిస్తే అవస్థలు తొలగుతాయని భావిస్తున్నారు. 1000ఏళ్ల చరిత్ర ఉన్న రంగనాయకస్వామి ఆలయం, సిద్ధేశ్వర గుట్టలు, పాలరాపుల గుట్ట, జోడేఘాట్ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతున్నారు. ఇంకేం కావాలో కామెంట్ చేయండి.

Similar News

News September 17, 2025

కావలిలో SI ఇంటి ముందు మహిళ ఆందోళన

image

కావలిలోని ముసునూరులో SI వెంకట్రావు ఇంటిముందు మంగళవారం రాత్రి ఓ మహిళ ఆందోళనకు దిగింది. గతంలో ఎస్ఐ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఎస్పీకి ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు ఎస్ఐ వెంకట్రావుపై కేసు నమోదు చేసి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నగదు ఇచ్చేలా ఇటీవల ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. మధ్యవర్తులు తనకు నగదు ఇవ్వలేదని ఆమె నిన్న రాత్రి ఒంటిమీద పెట్రోల్ పోసుకుని ఆందోళన చేసింది.

News September 17, 2025

బుమ్రాకు రెస్ట్?

image

ఆసియా కప్‌లో ఇప్పటికే సూపర్-4కు చేరిన భారత్ గ్రూప్ స్టేజ్‌లో తన చివరి మ్యాచ్ ఎల్లుండి ఒమన్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో బుమ్రాకు రెస్ట్ ఇవ్వనున్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. UAE, పాక్‌తో జరిగిన 2 మ్యాచుల్లోనూ బుమ్రా మంచి రిథమ్‌తో కన్పించారు. ఈ క్రమంలో కీలక ప్లేయర్ అయిన ఆయన గాయాల బారిన పడకుండా ఉండాలని యాజమాన్యం భావిస్తున్నట్లు తెలుస్తోంది. బుమ్రా స్థానంలో అర్ష్‌దీప్ లేదా హర్షిత్ ఆడే ఛాన్స్ ఉంది.

News September 17, 2025

BELలో ఉద్యోగాలు.. దరఖాస్తుకు ఇవాళే లాస్ట్ డేట్

image

బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(<>BEL<<>>) 16 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టును బట్టి బీటెక్, బీఈ, బీఎస్సీ ఇంజినీరింగ్, ఎంఎస్సీ, ఎంసీఏ పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.150. అభ్యర్థులను రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://bel-india.in/