News March 5, 2025

ASF: భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్

image

గత రెండు రోజుల క్రితం మండలం లోడుపల్లి గ్రామంలో వివాహిత అనుమానాస్పద మృతి విషయం తెలిసిందే. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లుగా సీఐ శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం ఉదయం 10:30 గంటలకు ఎంకపల్లి బస్టాండ్ వద్ద భర్త గణేశ్, అతని తండ్రిని అదుపులోకి తీసుకొని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించానని చెప్పినట్లు SI కొమురయ్య తెలిపారు.

Similar News

News March 5, 2025

ఆదిలాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

■ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం
■ గాంధీ భవన్‌లో ఆదిలాబాద్ నాయకులతో సమీక్షా సమావేశం
■ ఆదిలాబాద్‌కు ఏయిర్ పోర్ట్ తీసుకొస్తా: ఎంపీ
■ జోగురామన్న వ్యాఖ్యలను ఖండించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే
■ మహారాష్ట్రలో యాక్సిడెంట్.. 16 మంది జిల్లా వాసులకు గాయాలు
■ BJPలో చేరిన సాత్నాల గ్రామస్థులు
■ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి

News March 5, 2025

గాంధీ భవన్‌లో ఆదిలాబాద్ సమీక్షా సమావేశం

image

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో బుధవారం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి, మంత్రి సీతక్క హాజరై జిల్లాకు సంబంధించిన పలు అభివృద్ధి పనులపై చర్చించారు. ఎమ్మెల్యే బొజ్జు, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు, విష్ణునాథ్, విశ్వనాథం పాల్గొన్నారు.

News March 5, 2025

ఉట్నూర్: చెట్టు లాలించింది.. అమ్మ పరీక్ష రాసొచ్చింది

image

చీరతో చెట్టుకు ఊయలకు కట్టి అందులో పాపను ఉంచి తల్లి ఇంటర్ పరీక్ష రాసిన ఆసక్తికర ఘటన ఉట్నూర్ మండలం లాల్‌టెక్డిలో చోటుచేసుకుంది. స్థానిక గురుకుల కళాశాలలోని పరీక్షకేంద్రానికి బుధవారం ఓ తల్లి బిడ్డతో వచ్చింది. చదువుకోవాలనే తపన తల్లిది.. కానీ బిడ్డను ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి. అలాంటి సమయంలో పాలు తాగే వయసున్న బిడ్డను చెట్టుకు చీరతో ఊయల కట్టి అందులో ఉంచింది. తోడుగా తన తల్లిని ఉంచి పరీక్ష రాసొచ్చింది.

error: Content is protected !!