News September 15, 2025

ASF: మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్‌లో దరఖాస్తుల ఆహ్వానం

image

సామాజిక న్యాయ, సాధికారత మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు జిల్లాలో వయోవృద్ధుల కోసం మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు సంక్షేమ శాఖ కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ సెంటర్‌లో సేవలందించేందుకు సీనియర్ సిటిజన్ అనిసియేషన్, NGOల నుంచి దరఖాస్తు కోరడం జరుగుతుందన్నారు. అనుభవం కలిగిన వారు పూర్తి వివరాలతో ఈనెల 19లోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

Similar News

News September 15, 2025

KNR: ప్రజావాణికి 387 దరఖాస్తులు

image

ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. 387 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో రమేష్ బాబు పాల్గొన్నారు.

News September 15, 2025

రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేటాయించండి: తుమ్మల

image

TG: రాష్ట్ర అవసరాలకు సరిపడా యూరియా కేటాయించాలని‌ కేంద్ర ఎరువుల శాఖ కార్యదర్శి రజత్ కుమార్ మిశ్రాను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఢిల్లీ వెళ్లిన మంత్రి యూరియా కేటాయింపులు వీలైనంత త్వరగా చేయాలని విన్నవించారు. దేశీయ యూరియా ఉత్పత్తి ఆశించిన స్థాయిలో లేదని ఆయన మంత్రికి వివరించారు. విదేశాల నుంచి దిగుమతయ్యే యూరియాలో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని రజత్‌ కుమార్‌ తెలిపారు.

News September 15, 2025

ASF: ‘పాఠశాలలో ఉపాధ్యాయులు నియమించండి’

image

కెరమెరి మండలంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని NHRC జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ ఈరోజు DEO దీపక్ తివారికి వినతిపత్రం ఇచ్చారు. పాఠశాలలో ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కాగజ్ నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లే రోడ్డు సక్రమంగా లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ సమస్యలను పరిష్కరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు.