News July 4, 2025
ASF: ‘మహనీయుల ఆశయ సాధనకు కృషి చేయాలి’

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, అమరుడు దొడ్డి కొమురయ్య వర్ధంతి, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతిని ఆసీఫాబాద్ కలెక్టరేట్‌లో నిర్వహించారు. ఇక్కడ ఇరువురి చిత్రపటాలకు ASF కలెక్టర్ వెంకటేష్ ధౌత్రే, ఎమ్మెల్యే కోవాలక్ష్మి నివాళులర్పించారు. మహనీయుల సేవలను స్మరించుకుంటూ, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. జేసీ డేవిడ్, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులున్నారు.
Similar News
News July 4, 2025
మిర్యాలగూడ: లక్కీ డ్రా పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్

మిర్యాలగూడలో లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ రోజు మిర్యాలగూడలో నిందితుల వివరాలను ఎస్పీ శరత్ చంద్ర పవర్ మీడియా ద్వారా వెల్లడించారు. నిందితుల నుంచి రూ.70 లక్షల విలువ చేసే ఫర్నిచర్, నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 2,143 మంది బాధితుల నుంచి సుమారు రూ.1.37 కోట్లు వసూలు చేసినట్లు చెప్పారు.
News July 4, 2025
నల్గొండ జిల్లాలో యువకుడి ఆత్మహత్య

ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఎలికట్టే గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన జక్కలి మత్స్యగిరి(22) పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబీకులు అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు. మృతుడి భార్య మహేశ్వరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 4, 2025
శ్రీశైలం మల్లన్న భక్తులకు గుడ్ న్యూస్

AP: శ్రీశైల మల్లికార్జున స్వామి ఉచిత స్పర్శ దర్శనానికి ఇకపై ఆన్‌లైన్ టోకెన్లు పొందవచ్చని ఆలయ ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం-శుక్రవారం వరకు మ.1.45 గంటల నుంచి 3.45 గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనం చేసుకోవచ్చన్నారు. వచ్చేవారం నుంచి టోకెన్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని, ఇందుకోసం https://www.srisailadevasthanam.org/en-in సైట్‌లో ఒక రోజు ముందుగా మాత్రమే బుక్ చేసుకోవాలని సూచించారు.