News March 1, 2025

ASF: మహిళలు, చిన్నపిల్లల రక్షణే తొలి ప్రాధాన్యత: ఎస్పీ

image

మహిళలు, చిన్నపిల్లల రక్షణే పోలీస్ శాఖ తొలి ప్రాధాన్యత అని ఆసిఫాబాద్ ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. మహిళలు, చిన్న పిల్లల చట్టాలపై షీ టీం, భరోసా టీం ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ 65 హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 14 అవేర్నెస్ కార్యక్రమాలు నిర్వహించి 2 ఫిర్యాదులు స్వీకరించినట్లు వెల్లడించారు.

Similar News

News March 1, 2025

ఏటికొప్పాక బొమ్మలకు అరుదైన గౌరవం

image

AP: అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక లక్క బొమ్మలకు అరుదైన గౌరవం లభించింది. ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో ఆ బొమ్మల స్టాల్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకోసం శరత్ అనే కళాకారుడిని ఎంపిక చేసింది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన రిపబ్లిక్ పరేడ్‌లో ఏటికొప్పాక బొమ్మల శకటం ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

News March 1, 2025

BREAKING: కాచిగూడ-నిజామాబాద్ డెమో రైలు రద్దు

image

కాచిగూడ-నిజామాబాద్ మధ్య నడిచే (77601/77602) డెమో రైళ్లను శనివారం నుంచి మార్చి నెలాఖరు వరకు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాచిగూడ-నిజామాబాద్ సెక్షన్లో ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్న కారణంగానే ఈ రైళ్లను రద్దు చేసినట్లు సీపీఆర్వో శ్రీధర్ తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణీకులు గమనించాలని ఆయన కోరారు.

News March 1, 2025

నంద్యాల జిల్లా టుడే TOP NEWS

image

☞ గాలికుంటు టీకాల పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్ ☞ PMAY కింద జిల్లాకు 59,255 గృహాల మంజూరు: హౌసింగ్ పీడీ ☞ ఇంటర్ విద్యార్థులకు నంద్యాల ఎంపీ ఫోన్ ☞ మహిళా దినోత్సవం.. నంద్యాలలో భారీ ర్యాలీ ☞ రోజాకు ఎమ్మెల్యే అఖిలప్రియ కౌంటర్ ☞ బడ్జెట్ లో రాయలసీమకు తీవ్ర అన్యాయం: కాటసాని ☞ పింఛన్ల పంపిణీలో మంత్రి బీసీ ☞ ఇంటర్ పరీక్షలకు 595 మంది డుమ్మా ☞ శ్రీశైలంలో నకిలీ నోట్ల కలకలం ☞ 93.74% పింఛన్ల పంపిణీ

error: Content is protected !!