News November 4, 2025
ASF: మహిళల భద్రతకు షీ టీమ్స్: ఎస్పీ కాంతిలాల్ పాటిల్

ఆసిఫాబాద్ జిల్లాలో మహిళలు, యువతుల భద్రత కోసమే షీ టీమ్స్ పనిచేస్తున్నాయని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ తెలిపారు. హింసకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఆయన సూచించారు. అక్టోబర్ నెలలో షీ టీమ్స్ ద్వారా 87 హాట్‌స్పాట్‌లను గుర్తించి, 22 అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ఈ క్రమంలో 16 మంది అకతాయిలను పట్టుకుని, ఆరుగురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News November 4, 2025
కామారెడ్డి: డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారా..!

కామారెడ్డి జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మొత్తం 14 మందికి న్యాయస్థానం శిక్ష ఖరారు చేసింది. కామారెడ్డి PS పరిధిలో ఓ వ్యక్తికి ఒక రోజు జైలు శిక్ష, రూ.వెయ్యి జరిమానా విధించింది. మరో 9 మందికి రూ.9 వేలు జరిమానాలు వేశారు. దేవునిపల్లి పరిధిలో ముగ్గురికి రూ.3 వేల చొప్పున జరిమానా, బీబీపేట్ పరిధిలోని ఓ వ్యక్తికి రూ.వెయ్యి జరిమానాలు విధించింది.
News November 4, 2025
నేటి నుంచి బుగులోని వెంకన్న జాతర ప్రారంభం

భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని బుగులోని జాతర బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ జాతరకు భక్తులు అధిక సంఖ్యలో ఎడ్ల బండ్లపైన చేరుకుంటారు. నేడు స్వామివారిని మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో ఊరేగింపుగా కొండ వద్దకు తీసుకుస్తారు. దీంతో జాతర వైభవం లాంఛనంగా ప్రారంభం కానుంది.
News November 4, 2025
మాన్యువల్ స్కావెంజింగ్ రహిత జిల్లాగా ఖమ్మం: కలెక్టర్

సుప్రీంకోర్ట్ ఆదేశాలతో జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్ల పరిశీలన చేపట్టినట్లు, ఖమ్మం జిల్లాలో మాన్యువల్ స్కావెంజర్లు కనుగొనలేదని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం జిల్లా మాన్యువల్ స్కావెంజింగ్ రహితంగా ప్రకటించినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి స్కావెంజర్ల పరిశీలన నిశితంగా పరిశీలించారన్నారు.


