News February 20, 2025

ASF: మానవత్వం చాటుకున్న మహిళ కండక్టర్

image

ఆర్టీసీ బస్సు మహిళ కండక్టర్ మానవత్వం చాటుకున్నారు. బుధవారం ఆసిఫాబాద్ డిపోకు చెందిన బస్సులో ప్రయానించిన తిర్యాణికి చెందిన దేవిదాస్ తన భార్యకు చెందిన సర్టిఫికెట్స్ బస్సులో మర్చిపోయాడు. గమనించిన కండక్టర్ మునెమ్మ వాటిని డీఎం విశ్వనాథ్‌కు అప్పగించింది. దీంతో ఆయన సంబంధిత వ్యక్తికి సమాచారం అందించి సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం కండక్టర్‌ను అభినందించారు.

Similar News

News November 12, 2025

2026 వన మహోత్సవం లక్ష్యం 52 లక్షలు: కలెక్టర్

image

2026 సంవత్సరంలో వన మహోత్సవంలో భాగంగా ASF జిల్లా వ్యాప్తంగా 52 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించామని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే వెల్లడించారు. మంగళవారం ASF కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వన మహోత్సవంపై దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామపంచాయతీలో లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచేందుకు కార్యచరణ రూపొందించాలని, అవసరమైన మట్టి విత్తనాలు సేకరించాలని తెలిపారు.

News November 12, 2025

‘ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి’

image

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం ASF జిల్లా కలెక్టరేట్ సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌తో కలిసి గృహ నిర్మాణశాఖ అధికారులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, నర్సరీలలో మొక్కల పెంపకం, ఈనెల 14న పాఠశాలలలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహణ అంశాలపై సమీక్ష నిర్వహించారు.

News November 12, 2025

ఎగ్జిట్ పోల్స్: 2015, 2020లో ఏం జరిగింది?

image

బిహార్ ప్రజల నాడిని ఎగ్జిట్ పోల్స్ పట్టలేకపోతున్నాయని 2015, 2020 ఎన్నికల ఫలితాల్లో తేలింది. 2015లో మహాఘట్‌బంధన్‌(JDU+RJD+INC), NDAకు గట్టి పోటీ ఉంటుందని 6 మేజర్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అయితే MGB 178 సీట్లు గెలవగా, NDA 58 సీట్లకు పరిమితమైంది. 2020లో MGB(INC+RJD)దే గెలుపని 11 ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే JDUతో కూడిన NDA 125 సీట్లతో అధికారంలోకి వచ్చింది.
* మరి ఈసారి తీర్పు ఎలా వస్తుందో?