News August 24, 2025
ASF: మునుగోళ్లతో మొక్కులు చెల్లించిన ఆదివాసులు

పెంచికలపేట్ మండలం జిల్లెడ గ్రామంలో ఆదివాసులు సాంప్రదాయంగా మునుగోళ్లపై వెళ్లి బొడగ మొక్కులు చెల్లించుకున్నారు. శ్రావణమాసం ప్రారంభంలో వెదురు బొంగులతో తయారు చేసిన మునుగోళ్లపై నడుస్తూ ఉంటారు. అమావాస్య మరుసటి రోజున బొడగ పండగలో భాగంగా మునుగోళ్లతో ఊరి పొలిమేరలోని ఇప్పచెట్టు వద్దకు వెళ్తారు. నైవేద్యాలు సమర్పించి వాటిని అక్కడ వదిలేస్తారు.
Similar News
News August 24, 2025
ఖైరతాబాద్ మహాగణపతికి స్వాగతం చెప్పేందుకు సిద్ధం

వినాయక చవితి సందర్భంగా ఖైరతాబాద్ మహాగణపతికి ఘన స్వాగతం చెప్పేందుకు నగర భక్తులు సిద్ధమయ్యారు. ఈ సంవత్సరం 69 అడుగుల గణనాథుడు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. సోమవారం నేత్రోనిలం(కంటిపాప అమర్చడం) అనంతరం ఏకదంతుడికి స్వాగత కార్యక్రమలు ప్రారంభమవుతాయి. సాయంత్రం గణపతి ఆగమన్ నిర్వహించేందుకు ఖైరతాబాద్ యూత్ అసోసియేషన్ సిద్ధంగా ఉంది. 11 రోజుల పాటు మహాగణపతికి నగరవాసులను కనువిందు చేయనున్నాడు.
News August 24, 2025
ఆయుధాలు వాడకుండా ఉక్రెయిన్‌పై US ఆంక్షలు!

USమేడ్ లాంగ్-రేంజ్ ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్(ATACMS)ని ఉక్రెయిన్ వాడకుండా అమెరికా ఆపుతోందని WSJ పేర్కొంది. రష్యాపై ATACMS వాడేందుకు US అనుమతి కావాలని షరతు పెట్టినట్లు తెలిపింది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఆపలేకపోయానని ట్రంప్ ఫ్రస్ట్రేషన్‌తో ఉన్న నేపథ్యంలో ఈ వార్తలు రావడం గమనార్హం. మరోవైపు రష్యాపై టారిఫ్స్ వేయడం లేదా శాంతి చర్చల నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తానని ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.
News August 24, 2025
కడప: రేపటి నుంచి కౌన్సెలింగ్

కడప జిల్లాలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో సోమవారం నుంచి కౌన్సెలింగ్ జరుగుతుందని వీసీ డాక్టర్ విశ్వనాథ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. బీఎఫ్‌ఏ(ఫోర్ ఇయర్స్ డిగ్రీ) ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పం, బి. డెస్ ఇంటీరియర్ డిజైన్) కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.