News September 17, 2025
ASF: రక్తదానం చేసి ప్రాణదాతలు కండి: బీజేపీ

కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో బుధవారం సేవా పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం తెలిపారు. ఇందులో భాగంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని యువతకు పిలుపునిచ్చారు. ప్రతి వ్యక్తికి ఏదో ఒక సందర్భంలో రక్తం అవసరం పడుతుందన్నారు. జీవితంలో ఒక్కసారి అయినా రక్తదానం చేయాలని అన్నారు.
Similar News
News September 17, 2025
కృష్ణా: రైలులో గంజాయి అక్రమ రవాణా.. ఒకరి అరెస్ట్

కృష్ణా జిల్లా వ్యాప్తంగా గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో, బిలాస్‌పూర్ నుంచి తిరుపతి వెళ్లే రైలులో 4.5 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఒక వ్యక్తిని రామవరప్పాడు రైల్వే స్టేషన్‌లో అరెస్ట్ చేశారు. నిందితుడిని జీఆర్‌పీ పోలీసులకు అప్పగించారు. విచారణలో ఒరిస్సాలోని చాట్ల గ్రామంలో గంజాయి కొనుగోలు చేసి, చిత్తూరు జిల్లాలో విక్రయిస్తున్నట్లు అతడు తెలిపాడు.
News September 17, 2025
మేడారానికి ఓకే విడతలో రూ.150 కోట్లు: సీతక్క

ములుగు జిల్లా అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి సహకారం అందిస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. మేడారం జాతరకు ఒకే విడతలో రూ.150 కోట్లు, రోడ్లకు రూ.50 కోట్లు ఇచ్చారని తెలిపారు. ములుగు పట్టణంలో పంచాయతీ రోడ్లకు రూ.40 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. అధికారులు ప్రజాపాలనలో భాగస్వామ్యం కావాలని కోరారు. ములుగు జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళిక రూపొందించామని పేర్కొన్నారు.
News September 17, 2025
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయండి: కలెక్టర్

మాచర్లలో ఈ నెల 20న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై బుధవారం కలెక్టర్ మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం చేశారు. పర్యటనను విజయవంతం చేయడానికి వివిధ శాఖల మధ్య సమన్వయం అవసరమని, అందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.