News February 7, 2025
ASF: రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత శిక్షణ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో డిగ్రీ ఉత్తీర్ణులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులకు రిక్రూట్మెంట్ ఫౌండేషన్ కోర్సులకు ఉచిత అందించనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి పురుషోత్తం తెలిపారు. ఈ నెల 15 నుంచి ప్రారంభమయ్యే 4 నెలల ఉచిత శిక్షణలో అభ్యర్థులకు బుక్ ఫండ్, ప్రతి నెల స్టైఫండ్ ఇస్తామన్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 9 లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News November 15, 2025
యాపిల్‌కు త్వరలో కొత్త CEO.. టిమ్ కుక్ వారసుడు ఎవరు?

2011లో స్టీవ్ జాబ్స్ నుంచి టిమ్ కుక్ యాపిల్ CEOగా బాధ్యతలు అందుకున్నారు. కంపెనీని 4 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లిన కుక్.. 2026 ప్రారంభంలో తన వారసుడిని ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది. 2001లో హార్డ్‌వేర్ ఆర్కిటెక్ట్‌గా ప్రొడక్ట్ డిజైన్ టీమ్‌లో చేరిన జాన్ టెర్నస్ తదుపరి సీఈవోగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని టాక్. ఈ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్టు ఫైనాన్షియల్ టైమ్స్ రిపోర్టులో పేర్కొంది.
News November 15, 2025
కోరుట్ల: గుండెపోటుతో యువకుడి మృతి

గుండెపోటు రావడంతో ఉన్నచోటే పలువురు కుప్పకూలి ప్రాణాలు విడుస్తున్న ఘటనలు ఇటీవల పెరుగుతున్నాయి. శుక్రవారం కోరుట్ల పోచమ్మవాడకి చెందిన పిల్లి రాజు (34) అనే యువకుడు అర్ధరాత్రి బాత్రూం కోసం వెళ్ళి అక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.
News November 15, 2025
జగిత్యాల జిల్లాలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు

జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. అత్యల్పంగా కథలాపూర్‌లో 10.6℃ నమోదైంది. గొల్లపల్లి 10.9, మన్నెగూడెం 10.8, మల్లాపూర్ 11.1, అయిలాపూర్, పెగడపల్లి, గోవిందారం 11.2, జగ్గసాగర్ 11.3, మెడిపల్లి 11.4, రాఘవపేట 11.6, మద్దుట్ల, నెరెల్ల, అల్లీపూర్, కోరుట్ల 11.7, మల్యాల, పూడూర్ 11.8, రాయికల్, పొలాస 11.9, తిరుమలాపూర్ 12, సారంగాపూర్, జగిత్యాల, మెట్‌పల్లి 12.3℃గా నమోదయ్యాయి.


