News April 25, 2025

ASF: వడదెబ్బకు ఏడుగురి మృతి

image

ఉమ్మడి ADB జిల్లా అగ్నిగుండంలా మారింది. రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొన్ని మండలాల్లో 45 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో నిర్మల్ జిల్లాలో ముగ్గురు, మంచిర్యాల జిల్లాలో ఇద్దరు, ఆసిఫాబాద్‌లో ఒకరు, ఆదిలాబాద్‌లో ఒకరు చొప్పున మృతిచెందారు. అనధికారికంగా సంఖ్యల ఎక్కువే ఉండొచ్చు. జాగ్రత్తలు పాటించండి. బయట తిరగొద్దు. నీరు అధికంగా తాగండి.

Similar News

News April 25, 2025

కారేపల్లి: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన కారేపల్లి మండలంలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు కథనం ప్రకారం.. దుబ్బతండాకు చెందిన లావుడ్యా భద్రు(52) రెండు ఎకరాలలో మిర్చి, రెండు ఎకరాలలో పత్తి సాగు చేశాడు. పంట సరిగ్గా పండగ పోవడంతో చేసిన అప్పులు తీరవని బాధతో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడగా కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News April 25, 2025

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు ఇలా..

image

పెద్దపల్లి జిల్లాలో రోజురోజుకు ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది. వడగాళ్లతో పాటు ఉడకపోతా కు జనం బిక్కుబిక్కుమంటున్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా రామగిరి 44.5℃ నమోదు కాగా పాలకుర్తి 44.5, పెద్దపల్లి 44.4, సుల్తానాబాద్ 44.3, ఓదెల 44.2, ధర్మారం 43.7, అంతర్గాం 43.6, రామగుండం 43.5, కాల్వ శ్రీరాంపూర్ 43.3, ఎలిగేడు 43.2, జూలపల్లి 42.9, ముత్తారం 42.9, కమాన్పూర్ 42.4, మంథని 42.0℃ గా నమోదయ్యాయి.

News April 25, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన ∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం ∆} నేలకొండపల్లిలో భూభారతిపై అవగాహన కార్యక్రమం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన ∆} వేంసూరు మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన ∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

error: Content is protected !!