News August 14, 2025
ASF: ‘వర్షపు నీటి నిల్వలను తొలగించాలి’

ASF జిల్లాలోని నివాస ప్రాంతాల్లో వర్షపు నీటి నిల్వలను ఎప్పటికప్పుడు తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. బుధవారం ఆయన ఆసిఫాబాద్‌లోని పైకాజీనగర్‌లో నీటి నిల్వలను, వర్షపు నీరు ఇళ్లలోకి రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను పరిశీలించారు. రాబోయే 3 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, ప్రజల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.
Similar News
News August 14, 2025
యువతిపై గ్యాంగ్‌రేప్.. 10 మంది అరెస్ట్

TG: స్నేహం, ప్రేమ అంటూ యువతి(18)ని నమ్మించి ఆమెపై 10 మంది అత్యాచారానికి పాల్పడిన ఘటన జనగామలో సంచలనం సృష్టించింది. తొలుత ఓ యువకుడు ప్రేమ పేరుతో దగ్గరై అఘాయిత్యానికి పాల్పడగా, జూన్‌లో అతడి స్నేహితులూ ఆమెకు దగ్గరయ్యారు. మాట్లాడుకుందామని పిలిచి కారులో ఓ రూమ్‌కు తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు ఆమెను శారీరకంగా వాడుకున్నారు. తన చిన్నమ్మ సాయంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులు అరెస్టయ్యారు.
News August 14, 2025
భద్రాచల ఆలయానికి ISO గుర్తింపు

భద్రాచలం దేవస్థానానికి ISO గుర్తింపు లభించింది. దీనిని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ చేతులు మీదుగా దేవస్థానం కార్యనిర్వహణ అధికారి రమాదేవికి సర్టిఫికెట్‌ను ISO డైరెక్టర్ శివయ్య అందించారు. కాగా, ISO అనేది ఉత్పత్తి నాణ్యత, భద్రత, సామర్థ్యాన్ని ధ్రువీకరించే ఒక గుర్తింపు సంస్థ అని తెలిపారు.
News August 14, 2025
భద్రాచలం: సీతారామచంద్ర స్వామివారి నిత్యకళ్యాణం

భద్రాచల శ్రీ సీతారామచంద్ర స్వామివారి నిత్యకళ్యాణ మహోత్సవం గురువారం భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తుల రద్దీ కనిపించింది. సుప్రభాతం, తోమాల సేవ అనంతరం స్వామివారి, అమ్మవారి కల్యాణం శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవాయిద్యాలు, మంగళహారతులతో భక్తిపూర్వకంగా మారింది.